Begin typing your search above and press return to search.

కూతురుతో అల్లు అర్జున్ దీవాళి సెలబ్రేషన్స్..!

అల్లు అర్జున్ కి అల్లు అయాన్ అల్లు అర్హ ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా ఏ తండ్రికైనా కొడుకు మీద కన్నా కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 6:57 AM GMT
కూతురుతో అల్లు అర్జున్ దీవాళి సెలబ్రేషన్స్..!
X

దీపావళి సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా కూడా వారి ఫ్యామిలీ తో పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కూతురు అర్హాతో కలిసి బాణాసంచా కాల్చారు. అల్లు అర్హతో కలిసి షాట్స్ వెలిగిస్తూ వాటి వెలుగులను డైరెక్ట్ గా చూడకుండా తన స్పెడ్స్ ని కూతురికి ఇచ్చి చూడమన్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్, అర్హ దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎంత ఐకాన్ స్టార్ అయిన కూడా కూతురికి తండ్రి కాబట్టి తనని ఆడి పాండించే విషయంలో తండ్రిగా అల్లు అర్జున్ తన బాధ్యత తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ కి అల్లు అయాన్ అల్లు అర్హ ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా ఏ తండ్రికైనా కొడుకు మీద కన్నా కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ప్రతి ఇంట్లో లానే అల్లు అర్జున్ ఇంట్లో కూడా అల్లు అర్హానే అంతా డామినేషన్ అని తెలుస్తుంది.

పండుగ సెలబ్రేషన్ లో అల్లు అర్హని ఆడిస్తూ అల్లు అర్జున్ కనిపించాడు. అంతేకాదు తనని విష్ చేయడానికి వచ్చిన ఫ్యాన్స్ కి కూడా అభివాదం చేస్తూ కనిపించాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నా సరే దీపావళి కోసం కొద్దిగా గ్యాప్ ఇచ్చి పండుగ సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. పుష్ప 1 తో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 తో కూడా మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని టాక్.

పుష్ప 2 తవాత త్రివిక్రమ్ తో ఒక సినిమా లైన్ లో పెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత సందీప్ వంగాతో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు. మరి పుష్ప రాజ్ బాక్సాఫీస్ మేనియా ఎలా కొనసాగుతుందో చూడాలి. పుష్ప 2 నెక్స్ట్ ఇయర్ ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా మార్చి లో తన కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ తో ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్లు అందుకున్న బన్నీ డబుల్ హ్యాట్రిక్ షురూ చేయాలని చూస్తున్నారు. గుంటూరు కారం రిలీజ్ తర్వాత త్రివిక్రం ఏమాత్రం లేట్ చేయకుండా అల్లు అర్జున్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట.