Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఇదే అవుతుంది

`పుష్ప 2`తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే అవున‌నే చెప్పాలి. అత‌డు ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 షూటింగ్ లో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 4:21 AM GMT
అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఇదే అవుతుంది
X

`పుష్ప 2`తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే అవున‌నే చెప్పాలి. అత‌డు ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 షూటింగ్ లో ఉన్నాడు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో జాతరకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

టీమ్ నుండి లీకుల ప్ర‌కారం.. అల్లు అర్జున్ జాతర సన్నివేశంలో క్రేజీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఈ జాతర బ్యాక్‌డ్రాప్‌కి సినిమాలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని సమాచారం. అత‌డి రూపం ఆహార్యంలో వైవిధ్యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌ని చెబుతున్నారు. ఇదే బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే ఓ పాటను చిత్రీకరించగా, త్వరలోనే ఫైట్‌ను చిత్రీకరించనున్నారు.

రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కించిన కాంచ‌న 2లో హిజ్రా పాత్ర‌లో న‌టించిన త‌మిళ‌న‌టుడు శ‌ర‌త్ కుమార్ కి గొప్ప పేరొచ్చింది. పాథ్ బ్రేకింగ్ పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. థ‌ర్డ్ మ్యాన్ లాంటి చిత్రంలో క‌థానాయ‌కుడు హిజ్రా పాత్ర‌తో మెప్పించాడు. చాలా సినిమాల్లో అమ్మోరు పూన‌కం స‌న్నివేశాల్లో న‌టించిన స్టార్ల‌కు గొప్ప పేరొచ్చింది.ఇప్పుడు అదే త‌ర‌హాలో అల్లు అర్జున్ కి కూడా ఈ స‌న్నివేశం వ‌ల్ల గొప్ప పేరొస్తుంద‌ని చెబుతున్నారు. ఇందులో బ‌న్నీలోని సిస‌లైన న‌టుడు బ‌య‌టికి వ‌స్తున్నాడ‌ని కూడా గుసగుస‌లు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి డిఎస్పీ సంగీతం అందిస్తున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తుండ‌గా, ఫ‌హ‌ద్ ఫాసిల్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.