Begin typing your search above and press return to search.

బ‌న్నీ బ‌ర్త్ డేకి కొత్త క‌బురు అదేనా?

చిత్ర వ‌ర్గాల నుంచి కూడా రిలీజ్ కి సంబంధించిన స‌న్నాహాలు కూడా మొద‌లైపోయాయి అన్న డిస్క ష‌న్ లీకైంది

By:  Tupaki Desk   |   15 March 2024 12:37 PM GMT
బ‌న్నీ బ‌ర్త్ డేకి కొత్త క‌బురు అదేనా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ‌ర్త్ డే కి కొత్త క‌బురు చెప్ప‌బోతున్నాడా? `పుష్ప -2` స‌ర్ ప్రైజ్ తో పాటు ఎవ్వ‌రూ ఊహించని మ‌రో స‌ర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేసాడా? అంటే అవున‌నే టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తుంది. ఏప్రిల్ 8న బ‌న్నీ బ‌ర్త్ డే అన్న సంగ‌తి తెలిసిందే. ఇంకా 20 రోజుల‌కు పైగా స‌మ‌యం ఉంది. దీంతో అప్పుడే అభిమానుల్లో బ‌న్నీ ఎలాంటి ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడు అన్న చ‌ర్చ మొద‌లైంది. ఆ రోజు `పుష్ప‌-2` టీజ‌ర్ రిలీజ్ అవుతుందంటూ అభిమానులు కోటి ఆశ‌ల‌తో ఎదురు చూస్తున్నారు.

చిత్ర వ‌ర్గాల నుంచి కూడా రిలీజ్ కి సంబంధించిన స‌న్నాహాలు కూడా మొద‌లైపోయాయి అన్న డిస్క ష‌న్ లీకైంది. ఇదే సంద‌ర్భంగా అట్లీ భార్య ప్రియ ఇచ్చిన మ‌రో హింట్ ఇప్పుడు అంకంత‌కు కాక పుట్టి స్తుంది. `ఏ6 స్టోరీ డిస్క‌ష‌న్` అంటూ ఆమె ఓ వీడియోని రిలీజ్ చేసింది. దీంతో బ‌న్నీ -అట్లీ ప్రాజెక్ట్ క‌న్ప‌మ్ అయిందంటూ కొత్త క‌బురు ఊపందుకుంటుంది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా ఉందంటూ `జ‌వాన్` రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచి చ‌ర్చ‌కొస్తున్న సంగ‌తి తెలిసిందే.

బ‌న్నీకి అట్లీ స్టోరీ వినిపించ‌డం..ఆయ‌న ఒకే చేయ‌డం జ‌రిగిపోయింద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలు వైర‌ల్ అయ్యా యి. `పుష్ప‌-2` త‌ర్వాత ఐకాన్ స్టార్ ప‌ట్టాలెక్కించే సినిమా కూడా ఇదేన‌ని గ‌ట్టిగానే ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ప్రియ హింట్ ఇవ్వ‌డం ఇప్పుడు నెట్టింట కాక పుట్టిస్తుంది. ఇది బ‌న్నీ-అట్లీ సినిమా అప్ డేట్ అనే అభిమానులు ఫిక్సైపోతున్నారు. `పుష్ప‌- 2` టీజ‌ర్ వ‌స్తుందా? లేదా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి అట్లీ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ అయితే ఏప్రిల్ 8న షురూ చేయ‌డం ప‌క్కా అంటూ కోలీవుడ్ మీడియాలో సైతం క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి.

మ‌రి ప్రియ ఇచ్చిన హింట్ బ‌న్నీ కోస‌మా? లేక మ‌రే కోలీవుడ్ హీరో కోస‌మా? ఈ రెండు గాక షారుక్ ఖాన్ కోస‌మా? షారుక్ ఖాన్- విజ‌య్ కాంబినేష‌న్ లో కూడా ఓ సినిమా చేస్తాన‌ని అట్లీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్రియ లీక్ వెనుక ఇన్ని సందేహాలున్నాయి. ప్ర‌స్తుతం బ‌న్నీ `పుష్ప‌-2` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.