Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్-అట్లీ.. అసలు సమస్య ఇదే!

అయితే ఈ మూవీ తర్వాత బన్నీ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేయడం దాదాపు ఫిక్స్ అయినట్టే.

By:  Tupaki Desk   |   1 April 2024 6:30 AM GMT
అల్లు అర్జున్-అట్లీ.. అసలు సమస్య ఇదే!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల దుబాయ్ టుస్సాడ్స్ మ్యూజియంలో జరిగిన తన మైనపు విగ్రహ ఆవిష్కరణ వేడుకకు వెళ్లి వచ్చి సెట్స్ లో మళ్లీ అడుగు పెట్టారు. కచ్చితంగా అనుకున్న డేట్ కే సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యి మూవీ టీమ్ కు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత బన్నీ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేయడం దాదాపు ఫిక్స్ అయినట్టే.

గత ఏడాది బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అట్లీ. ఇక అల్లు అర్జున్ తో మూవీ చేసి పాన్ ఇండియా లెవెల్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాత అల్లు అరవింద్ తో అట్లీ పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కానీ ప్రాజెక్ట్ పై ఇంకా ఏదీ ఫైనల్ కాలేదట. ఈ సినిమా విషయంలో అట్లీ కొన్ని కండీషన్లు పెట్టినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

జవాన్ సినిమాకు గాను అట్లీకి భారీ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో కూడా షేర్ అందిందట. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కు కూడా అలానే అడుగుతున్నారట. పారితోషికం తో పాటు థియేట్రికల్ బిజినెస్ లో షేర్ కూడా కావాలని అంటున్నారట. అయితే ప్రాఫిట్ షేర్ ఓకే గానీ.. రెమ్యునరేషన్ తగ్గించమని అల్లు అరవింద్ అడుగుతున్నారట. ఇప్పుడు వీరి మధ్య డీల్ ఫిక్స్ అవ్వడమే లేట్.. అనౌన్స్మెంట్ వచ్చేయనుందట.

అంతా ఓకే అయితే.. అల్లు అర్జున్ బర్త్ డే అంటే ఏప్రిల్ 8వ తేదీన ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుందట. ఈ సినిమాతో అట్లీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. బన్నీతో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట. తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే ఛాన్స్ కొట్టినట్లు సమాచారం.

ఇప్పటికే పూజా హెగ్డే.. అల్లు అర్జున్ తో కలిసి దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో సినిమాల్లో యాక్ట్ చేసింది. మరోసారి అట్లీ మూవీలో బన్నీ, పూజ జోడీగా నటించనున్నారట. అట్లీతో మూవీ తర్వాత స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్, బోయపాటి శ్రీనుతో బన్నీ సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.