Begin typing your search above and press return to search.

జవాన్ కోసమే బన్నీ వెయిటింగ్

షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి వస్తోంది.

By:  Tupaki Desk   |   3 Sep 2023 4:46 AM GMT
జవాన్ కోసమే బన్నీ వెయిటింగ్
X

షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి వస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వస్తోన్న ఈ మూవీపై చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. షారుఖ్ ఖాన్ సొంతం ప్రొడక్షన్ లోనే ఈ సినిమాని నిర్మించారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అత్లీ జవాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే అతను ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో ఆవిష్కరించారో అర్ధమవుతోంది.

మూవీలో నయనతార, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఉండటం వలన తెలుగు, తమిళ్ భాషలలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీ రిజల్ట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందరికంటే ఎక్కువగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ ప్రస్తుతం తన ఇమేజ్ ని గ్లోబల్ లెవల్ లో ఎస్టాబ్లిష్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

నేషనల్ అవార్డు అందుకోవడం ద్వారా మరింతగా సినిమాల సెలక్షన్స్ లో తన బాద్యత పెరిగింది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి కమిట్ అయ్యారు. తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా ఉంటుంది. వీటి తర్వాత అత్లీతో సినిమా చేసే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నారు. అత్లీ కూడా చాలా సంవత్సరాల నుంచి టాలీవుడ్ స్టార్స్ తో మూవీస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో అత్లీ ప్రాజెక్ట్ ఫైనల్ వరకు వచ్చి ఎందుకనో ఆగినట్లు ప్రచారం జరిగింది. జవాన్ తర్వాత తెలుగు హీరోతోనే అత్లీ మూవీ చేసే ఛాన్స్ ఉంది. బన్నీని అత్లీ గతంలో అప్రోచ్ అయినట్లు టాక్. ఈ నేపథ్యంలోనే జవాన్ రిజల్ట్ బట్టి అల్లు అర్జున్ అత్లీకి ఒకే చెప్పాలా లేదా అనేది డిసైడ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. జవాన్ ట్రైలర్ చూస్తుంటే మాత్రం కచ్చితంగా హిట్ అయ్యేలానే ఉంది.

ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ ని కొల్లగొడితే మాత్రం అత్లీ నెక్స్ట్ సినిమా కచ్చితంగా బన్నీతో ఉండే ఛాన్స్ లు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో తెలియాలంటే జవాన్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.