Begin typing your search above and press return to search.

AAA - అల్లు అరవింద్ ధైర్యం చేయలేక..?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చిన్న నిర్మాణ సంస్థలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి

By:  Tupaki Desk   |   2 April 2024 2:30 AM GMT
AAA - అల్లు అరవింద్ ధైర్యం చేయలేక..?
X

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చిన్న నిర్మాణ సంస్థలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక బడా సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్, దిల్ రాజు బ్యానర్స్ కూడా అదే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. దీంతో మిగతా కొన్ని టాప్ ప్రొడక్షన్ హౌజ్ లు కూడా పాన్ ఇండియా అవకాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోవడం లేదు. బడా స్టార్స్ తో ఛాన్స్ దొరికితే వెంటనే ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నాయి.

ఇక గీతా ఆర్ట్స్ కూడా ఎప్పటినుంచో పాన్ ఇండియా సినిమాను నిర్మించాలని అనుకుంటుంది. నిర్మాత అల్లు అరవింద్ ఒకప్పుడు చాలా పెద్ద సినిమాలనే నిర్మించారు. అయితే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆయన మిగతా వారిలాగా వేగంగా అయితే సినిమాలను అనౌన్స్ చేయడం లేదు. మీడియం రేంజ్ సినిమాలు చేస్తున్నారు కానీ అంతకుమించినా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఇంకా నిర్మించడం లేదు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తోనే గీతా ఆర్ట్స్ స్థాయిని పెంచే విధంగా అడుగులు వేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టును నిర్మించాలని అనుకున్న విషయం తెలిసిందే. దానికి అనిరుధ్ మ్యూజిక్ అనుకున్నారు. ఇక వర్కింగ్ టైటిల్ గా #AAA అనుకుంటున్నారు. ఫైనల్ గా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 18వ తేదీన ఈ కాంబినేషన్ పై అధికారికంగా మరో క్లారిటీ కూడా ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ తరుణంలో అల్లు అరవింద్ ఒక విషయంలో ధైర్యం చేయలేకపోయినట్లుగా తెలుస్తోంది.

దీంతో ప్రాజెక్టులో మరో అగ్రనిర్మాణ సంస్థ అత్యధిక స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ సంస్థ మరేదో కాదు.. రీసెంట్ గా రజనీకాంత్ తో జైలర్ సినిమాతో బిగ్ సక్సెస్ చూసిన సన్ పిక్చర్స్ అని టాక్. అల్లు అరవింద్ తో కలిసి ఈ కాంబినేషన్ ను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఆ సంస్థదే ఉన్నట్లు సమాచారం.

అల్లు అరవింద్ ఈ సినిమాను సోలోగా నిర్మించకపోవడానికి ఒక కారణం ఉంది అని ఇండస్ట్రీలో కొన్ని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు అట్లీ 60 కోట్ల పారితోషకంతో పాటు సినిమా బిజినెస్ లో కూడా వాటా కావాలని కండిషన్ పెట్టడంతో ధైర్యం చేయలేకపోయినట్లు సమాచారం. దీంతో సన్ పిక్చర్స్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అయితే ఆ సంస్థ అట్లీ కండిషన్స్ కు వెంటనే ఒప్పుకున్నట్లు టాక్.

ఇక అల్లు అరవింద్ కేవలం సహనిర్మాతగానే ఉండగా సన్ పిక్చర్స్ మెయిన్ ప్రొడ్యూసర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సన్ పిక్చర్స్ కూడా ఈ సినిమాను సోలోగానే నిర్మించాలని అనుకుంది. కానీ అల్లు అరవింద్ మాత్రం గీత ఆర్ట్స్ బ్యానర్ రేంజ్ ను మరింత పెరిగేలా చేయాలి అని ఆలోచించి భాగస్వామిగా ఉండడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రిస్క్ లేకుండా ఈ కాంబినేషన్ పై పెట్టుబడి పెట్టి పూర్తి బాధ్యత సన్ పిక్చర్ వారికి అప్పగిస్తున్నారట. ఇక సినిమా హిట్టయితే పాన్ ఇండియా రేంజ్ లో క్రెడిట్ దక్కుతుందని అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో సరైన క్లారిటీ బన్నీ పుట్టినరోజు ఇస్తారో లేదో చూడాలి.