Begin typing your search above and press return to search.

చిరంజీవిపై అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి నిర్మాత అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   23 March 2024 8:07 AM GMT
చిరంజీవిపై అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!
X

మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి నిర్మాత అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్స్ పెస్టివ‌ల్ వేడుక‌లో భాగంగా ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మ కుటుంబం నుంచి ఎంతో మంది ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టేందుకు బాట వేసింది చిరంజీవినే అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి అల్లు శిరీష్ వ‌ర‌కూ అంతా ఆయ‌న బాట‌లోనే న‌డిచార‌న్నారు. చిరంజీవి అంత పెద్ద ర‌హ‌దారి వేడ‌యంతో అంద‌ర‌కీ మార్గం సుగ‌మం అయింద‌న్నారు.

ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వైనం గురించి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి మెగాస్టార్ అయిన వైనం ఎంతో మందికి స్పూర్తి దాయ‌కం. నేటి జ‌న‌రేష‌న్ యువ‌త కూడా ఆయ‌న స్పూర్తితోనే సినిమా ల్లోకి వ‌స్తున్నారు. జ‌న‌రేష‌న్ మారినా క‌ష్టం తెలిసిన చిరంజీవిని మాత్ర‌మే స్పూర్తిగా తీసుకుని వ‌స్తున్నా రంటే? ఆయ‌న ఎంత‌గా ప్ర‌భావితం చేస్తున్నార‌న్న‌ది అద్దం ప‌డుతుంది. ఇక మెగాస్టార్ కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోల గురించి తెలిసిందే.

అన్న‌య్య పిలిస్తేనే తాను సినిమాల్లోకి వెళ్లాన‌న‌ని..ఆయ‌న లేక‌పోతే తాను జీరో అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పారు. ఎలాంటి గ‌మ్యం లేకుండా ప్ర‌యాణం చేస్తున్న త‌న జీవితానికి చిరంజీవి సినిమా అనే మార్గం చూపించి..అందులో దారి వేయ‌డంతోనే నేడు అంత పెద్ద స్టార్ గా నీరాజ‌నాలు అందుకుం టున్న‌ట్లు చాలా సంద‌ర్భాల్లో అన్నారు. అలాగే రెండ‌వ బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా న‌టుడిగా ఎట్రీ ఇచ్చాడు.

కానీ అక్క‌డ స‌క్సెస్ కాక‌పోవ‌డంతో నిర్మాణం లోకి దిగాడు. అక్క‌డ కొన్నాళ్ల పాటు ప్ర‌యాణం సాగింది. ఇక మెగాస్టార్ వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డం కోసం రామ్ చ‌ర‌ణ్ కూడా ఎంట్రీ ఇవ్వ‌డం...పాన్ ఇండియా స్టార్ అయిన వైనం తెలిసిందే. అలాగే అల్లు అర‌వింద్ త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కూడా నేడు పెద్ద‌స్టార్. చ‌ర‌ణ్‌..బ‌న్నీల‌ను చిన్న‌ప్పుడు చిరంజీవి ప‌క్క‌న కూర్చొబెట్టుకుని డాన్సులు చేయించేవారు. యాక్టింగ్ లో అవ‌స‌ర‌మైన టెక్నిక్ లు నేర్పించారు.

మెగా మేన‌ల్లుళ్లుగా ఫేమ‌స్ అయిన సాయితేజ్..వైష్ణ‌వ్ తేజ్ కూడా న‌టులుగా రాణిస్తోన్న సంగ‌తి తెలిసిం దే. ఇద్ద‌రు యాక్టింగ్ లో స‌క్సెస్ అయ్యారు. అలాగే నాగ‌బాబు కుమార్తె నిహారిక కూడా న‌టిగా.. నిర్మాత‌గా ఈ రంగంలోనే రాణిస్తోంది. అల్లు శిరీష్ కూడా న‌టుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇంకా నిల‌దొక్కుకోలేదు. స‌రైన హిట్ కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా చిరంజీవి ఎంతో మందిని ఇండ‌స్ట్రీకి అందించారు.