Begin typing your search above and press return to search.

ఒకే ప్రేమ్ లో మెగా-అల్లు కుటుంబాలు

సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ఈ సంద‌ర్భంగా అక్క‌డ రెండు కుటుంబాలు క‌లిసి ఒకే ప్రేమ్ లో దిగిన ఫోటో ఇది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 11:03 AM GMT
ఒకే ప్రేమ్ లో మెగా-అల్లు కుటుంబాలు
X

అపురూప దృశ్యం...అరుదైన దృశ్యం ఇది. మునుపెన్న‌డు చూడ‌ని చూడ చ‌క్క‌ని దృశ్యం. అంటే ఇదేనేమో! మెగా-అల్లు ఫ్యామిలీ లు ఒకే ప్రేమ్ లో ఇలా చిక్కారు. ఆ రెండు కుటుంబాల్లో ఏ ఒక్క‌రు మిస్ కాకుండా అంతా హాజ‌రైన తొలిస‌న్నివేశం ఇదే అయి ఉండొచ్చు. ఈ రెండు కుటుంబాలు నేటి సంక్రాతిని బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో సెల‌బ్రేట్ చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.


సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ఈ సంద‌ర్భంగా అక్క‌డ రెండు కుటుంబాలు క‌లిసి ఒకే ప్రేమ్ లో దిగిన ఫోటో ఇది. అంతా ఎంతో అందంగా ముస్తాబ‌య్యారు. కొత్త బ‌ట్ట‌ల్లో అంతా త‌ళ‌త‌ళ‌లాడిపోతున్నారు. ప‌ట్టు దుస్తులు...స‌రాయి కాంబినేష‌న్స్ లో మేల్స్ క‌నిపిస్తుంటే? ఎరుపు వ‌ర్ణం దుస్తుల్లో ఆ కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌ల‌కు క‌నిపిస్తున్నారు. దాదాపు అంతా సంప్ర‌దాయ చీర‌ల‌నే ధ‌రించారు. అదీ ఎరుపు రంగు చీర‌లో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతున్నారు. మ‌హిళ‌లంతా అంతా ఎరుపు రంగు డిజైన్స్ ధ‌రించ‌డగా...మ‌గ‌వారు అంతా వైట్ కోడ్ ని అనుస‌రించిన‌ట్లు తెలుస్తోంది.


ఈ పిక్ లో రెండు కుటుంబాల‌కు చెందిన ఏ ఒక్క‌రు మిస్ అవ్వ‌లేదు. ఇక ఈ ప్రేమ్ కి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద వారి వ‌ర‌కూ ఓ ఆర్డ‌ర్ లో కూర్చున్నారు. మ‌న‌వ‌లు-మ‌న‌వ‌రాళ్లు అంతా ఇంటి మెట్ల కింద కూర్చోగా ఆపైనా పెద్ద‌వారంతా కూర్చున్నారు. వాళ్ల ముందు అలంక‌రించిన కుండ‌లు.. అటు ఇటుగా నేచుర‌ల్ బెంగుళూరు కొబ్బ‌రి గెల‌లు ఏర్పాటు చేసారు. వెనుక ద్వారంని..స్థంబాల్ని బంతిపు వ్వులతో అందంగా అలంక‌రించారు.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇలా అంతా ఒకే చోట చేర‌డం ప‌ట్లు మెగా-అల్లు అభిమా నులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. చూడ‌చ‌క్క‌గా ఉన్న కుటుంబాలు అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తు న్నారు. ఈ ఫోటోని చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోవు అంటూ మ‌రికొంత మంది అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.