పదేళ్ల నుంచి అడుగుతున్నా పెళ్లికి నో!
అల్లు శిరీష్ ప్రోషెషనల్ కెరీర్ ఎలా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. అన్నయ్య బన్నీలా తమ్ముడు మాత్రం పెద్ద స్టార్ కాలేకపోయాడు.
By: Tupaki Desk | 9 May 2025 7:44 AMఅల్లు శిరీష్ ప్రోషెషనల్ కెరీర్ ఎలా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. అన్నయ్య బన్నీలా తమ్ముడు మాత్రం పెద్ద స్టార్ కాలేకపోయాడు. ఇంకా నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ సరైన సక్సెస్ పడటం లేదు. గతేడాది `బడ్డీ` అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు గానీ పెద్దగా ఆడలేదు. అంతకు మందు రెండేళ్ల క్రితం `ఊర్వశివో రాక్షసివో` అంటూ వచ్చాడు. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. ఇలా ఉంది శిరీష్ కెరీర్.
మరి ఈ ఏడాది కొత్త సినిమా కబురు ఏదైనా చెబుతాడా? అన్నది చూడాలి. ఆ సంగతి పక్కన బెడితే శిరీష్ ఇంకా సింగిల్. పెళ్లి చేసుకోని సంగతి తెలిసిందే. ఇంకా తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. ప్రస్తుతం శిరీష్ వయసు 37 ఏళ్లు. తాజాగా ఓ సినిమా ఈవెంట్లో శిరీష్ పెళ్లి టాపిక్ వచ్చింది. అందులో అల్లు అరవింద్ పదేళ్ల నుంచి పెళ్లి చేసుకోమన్నా చేసుకోవడం లేదన్నారు. దీనికి బధులుగా శిరీష్ తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.
పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ ఉండదని...సింగిల్ గా ఉండటం ఉత్తమం అన్నట్లు గా మాట్లాడాడు. ఇదే సమయంలో తన స్నేహితుల అనుభవాలు తనకు చెప్పినట్లు....వాళ్లలా తాను కూడా పెళ్లానికి బానిస కాకూడదు అన్నట్లు చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకుని తమలా బాధపడొద్దని స్నేహితులు సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. మధ్యలో యాంకర్ సుమ కూడా దూరింది.
కానీ టాపిక్ ఆమె వైపుగా డైవర్ట్ అవుతున్న సమయంలో నాకెందుకులే అని పక్కకు వెళ్లిపోయింది. మరి 37 వరకూ పెళ్లి చేసుకోని శిరీష్ అసలు కారణం ఏంటో చెప్పాలి. జీవితాంతం సింగిల్ గా ఉండిపోతాడా? మరో ఏడాది అగి చేసుకుంటాడా? అన్నది చూడాలి. ఇంట్లో మాత్రం తల్లిదండ్రుల నుంచి పెళ్లి చేసుకోమని తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం యువత కూడా పెళ్లిళ్లకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.