Begin typing your search above and press return to search.

నయానిక - అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ముఖ్య అతిథులు ఎవరంటే?

ఇక ఈ వేడుకకు ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారని అల్లు శిరీష్ వెల్లడించారు.

By:  Madhu Reddy   |   27 Feb 2026 11:03 AM IST
నయానిక - అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ముఖ్య అతిథులు ఎవరంటే?
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది వరుసగా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధం అయిపోయారు. అందులో భాగంగానే గత ఎనిమిది సంవత్సరాలుగా ఊరిస్తూ రహస్యంగా రిలేషన్ కొనసాగిస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఫిబ్రవరి 26న హిందూ , కొడవ సాంప్రదాయ పద్ధతుల్లో ఉదయపూర్ ప్యాలెస్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకొని అభిమానులను సంతోషపరిచారు.

ఇక ఇప్పుడు వీరి జాడలోనే మరొక సెలబ్రిటీ జంట వివాహానికి సిద్ధమయ్యింది. వారెవరో కాదు ప్రముఖ హీరో అల్లు శిరీష్.. ఆయన ప్రేయసి నయానికా రెడ్డి. మార్చి 6వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే పెళ్లికి ముందే ఇప్పుడు మరో ప్రత్యేక వేడుకను వీరు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "మార్చి 6వ తేదీన నయానికా రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నాను. కానీ మరో ప్రత్యేక వేడుకను పెళ్లికి ముందే ప్లాన్ చేశాము. మార్చి 2వ తేదీన అల్లు స్టూడియోస్ లో మా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నాము "అంటూ అల్లు శిరీష్ తెలిపారు.

ఇక ఈ వేడుకకు ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారని అల్లు శిరీష్ వెల్లడించారు. అల్లు - మెగా కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల సమక్షంలో ఈ సంబరాలు జరగనున్నాయి. ఏది ఏమైనా పెళ్లికి ముందే జరిగే ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను అల్లు శిరీష్ అత్యంత ఘనంగా జరుపుకోబోతుండడంతో ఈ వేడుకపై అంచనాలు పెరిగిపోయాయి . ముఖ్యంగా అల్లు అర్జున్ తన సినిమా షూటింగ్లను పక్కన పెట్టి.. తన తమ్ముడి పెళ్లి వేడుకలను దగ్గరుండి మరీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా జనవరి 30, 31 తేదీలలో దుబాయ్ లోని యాచ్ లో అల్లు శిరీష్ తన సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా పార్టీ నిర్వహించారు. అంతేకాదు హైదరాబాదులో అల్లు అర్జున్ కూడా తన తమ్ముడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఒక ప్రత్యేకమైన పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో పలువురు సినీ తారలు టాలీవుడ్ యంగ్ హీరోయిన్లు, హీరోలు కూడా సందడి చేశారు. పైగా ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ తన సతీమణి అల్లు స్నేహారెడ్డి, రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో పాటు అల్లు శిరీష్ తన కాబోయే భార్య నయనికా రెడ్డితో కలిసి బ్లాక్ డ్రెస్ కోడ్ లో గ్రూపు ఫోటో దిగి.. ఆ ఫోటోతో అందరినీ సర్ప్రైజ్ చేశారు.

అటు ఇప్పటికే హిందూ సంప్రదాయం ప్రకారం అల్లు శిరీష్ ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం కూడా పూర్తయింది. ఇదిలా ఉండగా నార్త్ సైడ్ చేసే సంగీత్, మెహందీ ఫంక్షన్లు ఉండవని అల్లు శిరీష్ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే నేరుగా ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెళ్లి శుభలేఖలు పంచడంలో తల్లిదండ్రులతో అల్లు శిరీష్ బిజీగా మారిపోయారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ , మెగా బ్రదర్ నాగబాబులను కలిసి శుభలేఖలు అందజేసిన ఈయన తదుపరి కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నారు.