అల్లు హీరో ఈసారి గట్టిగా ప్లాన్ చేయాల్సిందే..!
అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ కెరీర్ లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు.
By: Tupaki Desk | 3 Jun 2025 8:00 AM ISTఅల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ కెరీర్ లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. ఓ పక్క అల్లు అర్జున్ హిట్టు మీద హిట్టు కొట్టడమే కాదు పుష్ప రాజ్ పాత్రతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొదటి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ కూడా తీసుకొచ్చాడు. అలాంటి హీరో ఇంట్లో ఉండి కూడా శిరీష్ హీరోగా సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. గౌరవం సినిమాతో ఎప్పుడో 2013 లోనే తెరంగేట్రం చేసిన అల్లు శిరీష్ ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ కెరీర్ స్ట్రాంగ్ చేసుకోలేదు. వెనక అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నా కూడా శిరీష్ కెరీర్ సక్సెస్ ట్రాక్ ఎక్కకపోవడం విశేషం.
అల్లు శిరీష్ తన ప్రయత్నాలు తాను చేస్తున్నా కూడా అవేవి ఆడియన్స్ కి ఎక్కట్లేదు. కెరీర్ లో కొత్త జంటతో జస్ట్ ఓకే అనిపించుకున్న శిరీష్, శ్రీరస్తు శుభమస్తు సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఒక్క క్షణం, ఏబిసిడి, ఊర్వశివో రాక్షసివో ఇలా చేసిన సినిమాలన్నీ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా సినిమాకు రెండు మూడేళ్లు గ్యాప్ తీసుకుంటున్నా కూడా సక్సెస్ ఫాం లోకి రావట్లేదు అల్లు శిరీష్.
చివరగా లాస్ట్ ఇయర్ బడ్డీతో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకున్నాడు అల్లు శిరీష్. ఐతే అల్లు శిరీష్ నెక్స్ట్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది. ఈసారి ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో ఆడియన్స్ అందరినీ తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడట. సినిమా స్క్రిప్ట్ దశలోనే సర్ ప్రైజింగ్ గా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఐతే ఈ సినిమా దర్శకుడు ఎవరు ఎలాంటి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అన్న విషయాలు త్వరలో తెలుస్తాయి.
అల్లు ఫ్యామిలీ హీరోగా శిరీష్ తను కూడా స్టార్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకోవాలని దాదాపు 12 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఐతే కరెక్ట్ లైన్ అన్నది దొరక్క ఇన్నాళ్లు ఇబ్బంది పడ్డాడు. ఐతే నెక్స్ట్ సినిమా తన క్యారెక్టరైజేషన్ ఇంకా సినిమా అంతా వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట. సో తప్పకుండా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మరి అల్లు శిరీష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం అవుతుంది అన్నది చూడాలి.
