బాలీవుడ్ లో అల్లు బాబి..ఇది డాడ్ ఐడియానా!
ముంబై వేదికగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ స్టార్లతో సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
By: Tupaki Desk | 10 April 2025 5:00 PM ISTఅల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి 'గని' సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించినప్పటికీ తొలి సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందించింది. ఆ తర్వాత మళ్లీ బాబి నిర్మాతగా ఇంత వరకూ కొత్త సినిమా ప్రకటించలేదు. నిర్మాతగా కంటున్యూ అవుతాడనుకుంటే? ఆయన కామ్ గానే కనిపిస్తున్నాడు. అయితే బాబి ఇప్పుడు బాలీవుడ్ లో సొంత బ్యానర్ స్థాపించే ప్లాన్ లో ఉన్నట్లు లీకులందుతున్నాయి.
ముంబై వేదికగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ స్టార్లతో సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే అక్కడ డిస్ట్రిబ్యూషన్ పై కూడా మంచి పట్టు సాధించాలనే వ్యూహంతో ముంబై బయల్దే రుతున్నట్లు వినిపిస్తుంది. మరి ఉన్న పళంగా ముంబైకి వెళ్లాల్సి నంత పనేముంది? అంటే దీని వెనుక అల్లు అరవింద్ వ్యూహం ఉందనే అంశం తెరపైకి వస్తోంది. అరవింద్ ఇప్పటికే హిందీలో కూడా సినిమాలు నిర్మించారు.
అలాంటప్పుడు ఆయన వ్యూహం ఏంటి? అనుకుంటున్నారా? అంటే ఇదంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసమని వినిపిస్తుంది. 'పుష్ప'తో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన సంగతి తెలిసిందే. బన్నీ రేంజ్ ఇప్పుడు ప్రభాస్ సమానంగా ఉంది. బాలీవుడ్ హీరోలకు పోటీగానూ మారిపోయాడు. ఒక్క తెలుగు సినిమాతోనే హిందీలో జెండా పాతేసిన నటుడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. భవిష్యత్ లో మరిన్ని అద్భుతాలు హిందీ మార్కెట్ లో సృష్టించాలి. అది జరగాలంటే? మంచి కంటెంట్ ఒక్కటే సరిపోదు.
ఆ కంటెంట్ ని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అలా వెళ్లాలంటే నార్త్ మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ పై మంచి పట్టు ఉండాలి. అది జరగాలంటే స్థానికంగా అక్కడ మంచి పరిచయాలుండాలి. అందుకోసమే బాబినిప్పుడు అరవింద్ సాబ్ ముంబై పంపిస్తున్నట్లు వినిపిస్తుంది. తమ కంటెంట్ ని బయట సంస్థలకు ఇచ్చి రిలీజ్ చేయడం కంటే? సొంతంగా రిలీజ్ చేసుకుంటే అధిక లాభాలు చూడొచ్చు. రిలీజ్ లో పారదర్శకత ఉంటుంది అనే ఆలోచనతో అరవింద్ ముందుకెళ్తున్నట్లు క నిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.
