ఎన్టీఆర్ డైరెక్టర్ కన్ను పుష్పరాజ్‌పై పడిందా?
ఇదిలా ఉంటే దీని తరువాత అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 25 Jun 2025 6:41 AMకేజీఎఫ్ సిరీస్ సినిమాలతో దేశ వ్యాప్తంగా డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం `సలార్` తరువాత ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డార్క్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయనున్న ఈ మూవీ1969 నేపథ్యంలో సాగనుందట.
అంతే కాకుండా చైనా, బూటాన్ సరిహద్దుల్లో అత్యధిక భాగం ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుత కీలక షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ మూవీలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్ సినిమాపై అభిమానుల్లో అంచనాల్ని పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ పాన్ ఇండియా మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో క్రేజీ టాలీవుడ్ స్టార్‌తో పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ క్రేజీ స్టార్ మరెవరో కాదు పుష్పరాజ్ అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ మూవీకి ప్రిపేర్ అవుతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ తరహాలో సాగే సరికొత్త సూపర్ హీరో మూవీగా దీన్ని అట్లీ తెరపైకి తీసుకురాబోతున్నారు. బాలీవుడ్ క్రేజీ లేడీ దీపికా పదుకునే ఫస్ట్ టైమ్ బన్నీకి జోడీగా నటిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ చిత్రాల నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే బన్నీ, దీపికలపై లుక్ టెస్ట్ పూర్తి కావడంతో ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే దీని తరువాత అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు `రావణం` అనే టైటిల్‌ని కూడా పరిశీలిస్తున్నారని, ఈ భారీ పాన్ ఇండాయా ప్రాజెక్ట్‌ని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారని ఇన్ సైడ్ టాక్.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన దిల్ రాజు బ్యానర్ నుంచి వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న `డ్రాగన్` మూవీని కంప్లీట్ చేసిన తరువాతే ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులని ప్రారంభిస్తారని, తొలి సారి బన్నీ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్నీ ప్రాజెక్ట్ నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.