Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ షర్ట్ మీద హాస్య బ్రహ్మ..!

ఇక అల్లు అర్జున్ బ్రహ్మానందం కాంబో గురించి కూడా ప్రస్తావించాలి. బ్రహ్మి కామెడీ అంటే అల్లు అర్జున్ కి విపరీతమైన ఇష్టం.

By:  Tupaki Desk   |   2 May 2025 1:00 PM
అల్లు అర్జున్ షర్ట్ మీద హాస్య బ్రహ్మ..!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షర్ట్ మీద హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కనిపించారు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం చేసిన నెల్లూరు పెద్దా రెడ్డి పాత్ర ఫోటో ప్రింట్ ఉన్న వైట్ టీ షర్ట్ ని అల్లు అర్జున్ వేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ తన లుక్ పరంగా సంథింగ్ స్పెషల్ ఫోకస్ గా ఉంటాడు. తనను తాను జనాలకు చూపించే విషయంలో ఎంతో జాగ్రత్త పడే అల్లు అర్జున్ ఇవాళ బ్రహ్మానందం ఉన్న టీ షర్ట్ ధరించడం కూడా సర్ ప్రైజింగ్ గా అనిపించింది.

కచ్చితంగా ఈ టీ షర్ట్ తో మీడియాలో ఇలాంటి డిస్కషన్ మొదలవుతుందని తెలిసినా సరే అల్లు అర్జున్ ఈ టీ షర్ట్ వేసుకున్నాడు. స్టార్ సెలబ్రిటీల విషయంలో మీడియా చూపిస్తున్న శ్రద్ధ తెలిసిందే. వాళ్లు ఎక్కడ ఎప్పుడు ఎలా కనిపిస్తారు. వారి డ్రెస్సింగ్ నుంచి వారి యాటిట్యూడ్ ఇలా వారి మీదే స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఈ క్రమంలో ఇలానే ఎవరైనా స్టార్ కాస్త కొత్తగా కనిపిస్తే చాలు ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తారు.

ఇక అల్లు అర్జున్ బ్రహ్మానందం కాంబో గురించి కూడా ప్రస్తావించాలి. బ్రహ్మి కామెడీ అంటే అల్లు అర్జున్ కి విపరీతమైన ఇష్టం. అందుకే బ్రహ్మి అంటే అల్లు అర్జున్ ప్రత్యేక అభిమానం చూపిస్తాడు. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సీన్స్ ప్రేక్షకులను నవ్వించాయి. ఎప్పుడైనా బ్రహ్మిని కలవాలనిపిస్తే చాలు వెళ్లి ఆయన్ను కలిసి వస్తాడు అల్లు అర్జున్. బన్నీ కష్టం సినిమా పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ గురించి కూడా బ్రహ్మానందం చెబుతుంటాడు.

ఇలా ఇప్పుడు బ్రహ్మి ఫోటో ఉన్న టీ షర్ట్ ని వేసుకోవడం వల్ల మళ్లీ ఈ ఇద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే అట్లీ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. అట్లీ అల్లు అర్జున్ సినిమా ఓ మిగతా కాస్ట్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. పుష్ప 2 తో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నుంచి వస్తున్న ఈ మూవీపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.