Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ త‌గ్గితే పుష్ప‌రాజ్‌ మాత్రం త‌గ్గేదేలే!

`పుష్ప 2`తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ద‌క్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. దేశంలోని న‌లుమూల‌ల‌కు బ‌న్నీ క్రేజ్ పాకిన విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 April 2025 1:44 PM IST
ఎన్టీఆర్ త‌గ్గితే పుష్ప‌రాజ్‌ మాత్రం త‌గ్గేదేలే!
X

`పుష్ప 2`తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ద‌క్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. దేశంలోని న‌లుమూల‌ల‌కు బ‌న్నీ క్రేజ్ పాకిన విష‌యం తెలిసిందే. స్టైల్‌కు ఐకాన్‌గా నిలిచిన అల్లు అర్జున్ ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డుల్ని తిర‌గ‌రాయ‌డమే కాకుండా అత్యంత వివాదాల‌కు కేంద్ర బిందువుగా నిల‌వ‌డం, జాతీయ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మార‌డం తెలిసిందే. `పుష్ప ది రూల్` పేరుకు త‌గ్గ‌ట్టే బాక్సాఫీస్‌ని రూల్ చేసిన బ‌న్ప‌నీ ఈ సినిమాతో వ‌రల్డ్ వైడ్‌గా రూ.1800 కోట్లు సాధించి ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇంత‌టి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత అల్లు అర్జున్ సొంద‌ర‌ప‌డ‌కుండా `పుష్ప‌2` లాంటి బ్లాస్టింగ్ హిట్ త‌రువాత అంత‌కు మించి అనే స్థాయి సినిమాతో ప్రేక్ష‌కు ముందుకు రాబోతున్నాడు. `పుష్ప 2` త‌రువాత బ‌న్నీ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో పాన్ వ‌రల్డ్ మూవీకి శ్రీ‌కారం చుడుతున్న విష‌యం తెలిసిందే.అయితే ఈ సినిమా కోసం బ‌న్నీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్ర‌శాంత్ నీల్ `డ్రాగ‌న్‌` కోసం ఎన్టీఆర్ దాదాపు 18 కేజీలు బ‌రువు త‌గ్గ‌డం హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే.

ఎన్టీఆర్ ఏంటీ ఇలా త‌గ్గుతున్నాడు? .. ఎందుకింతగా త‌గ్గుతున్నాడు? ఎన్టీఆర్ బొద్దుగా ఉంటేనే మ‌జా కానీ ప్ర‌శాంత్ నీల్ అందుకు పూర్తి భిన్నంగా `డ్రాగ‌న్‌` కోసం ఎన్టీఆర్‌ని మ‌రీ లీన్‌గా త‌యారు చేస్తున్నాడేంటీ? అనే కామెంట్‌లు వినిపించాయి. ఎన్టీఆర్‌ని చూసి ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు కూడా. అయితే త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం పుష్ప‌రాజ్ మాత్రం త‌గ్గేదేలే అంటున్నాడు. అట్లీతో బ‌న్నీ ఓ భారీ ప్రాజెక్ట్‌ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

సన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్న ఈ ప్రాజెక్ట్ కోసం ప‌లువురు హాలీవుడ్ టెక్నీషియ‌న్‌లు ప‌నిచేయ‌బోతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌లో బ‌న్నీ సూప‌ర్ హీరో త‌ర‌హా క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అయితే అందు కోసం బ‌రువు త‌గ్గుతాడేమోన‌ని అంతా అనుకుంటే అందుకు పూర్తి భిన్నంగా బ‌న్నీ త‌గ్గేదేలే అన్న‌ట్టుగా మునుప‌టికంటే ఫిట్‌గా మారిపోయారు.

తాజాగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో బ‌న్నీ క‌నిపించిన తీరుకు అంతా అవాక్క‌వుతున్నారు. డెనిమ్ బ్లాక్ డ్రెస్‌లో బ‌న్నీ మునుప‌టికంటే ఫిట్‌గా మ‌రింత బొద్దుగా క‌నిపించ‌డం విశేషం. ఫిజిక్ పెంచేసిన అల్లు అర్జున్ మ‌రింత గ్లోతో క‌నిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఫ్యాష‌న్‌కి ఐకాన్‌గా భావించే బ‌న్నీ బ్లాక్ డ్రెస్‌లో మ‌రింత మ్యాన్లీగా క‌నిపించారు. ఇప్ప‌టికే అట్లీ మూవీ లుక్ టెస్ట్ పూర్తి కావ‌డంతో బ‌న్నీ ఈ మూవీలో మ‌రింత ఫిట్‌గా క‌నిపించి అద‌ర‌గొట్ట‌బోతున్నాడ‌ని అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.