Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్‌ అతిథిగా ఆ సంబరాలు..!

అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా విడుదల తర్వాత కొన్ని వారాల పాటు విదేశాల్లో విశ్రాంతి తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   20 May 2025 6:20 AM
Allu Arjun to Attend ATA Convention in the US After Pushpa 2 Success
X

టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్టార్‌డం పుష్ప 2తో ఒక్కసారిగా పెరిగి పోయింది. పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్‌ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. AA22XA6 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న బన్నీ-అట్లీ కాంబో మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ కంపెనీ ఈ సినిమా కోసం వర్క్‌ చేయబోతుంది. అంతే కాకుండా హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం వర్క్ చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి వీరి కాంబో మూవీ తెలుగు, తమిళ ప్రేక్షకుల్లోనే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా విడుదల తర్వాత కొన్ని వారాల పాటు విదేశాల్లో విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో అట్లీ సినిమా కోసం ఫిజికల్‌గా రెడీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ప్రముఖ ట్రైనర్ సమక్షంలో రెడీ అవుతున్న అల్లు అర్జున్‌ జులై నెలలో చిన్న బ్రేక్ తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. యూఎస్‌లోని తెలుగు వారి కోసం ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొనేందుకు గాను అల్లు అర్జున్‌ వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. జులైలో జరగబోతున్న 8వ అమెరికా తెలుగు సంబరాల్లో అల్లు అర్జున్‌ పాల్గొనేందుకు ఓకే చెప్పారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

సాధారణంగా యూఎస్‌లోని తెలుగు అసోషియేషన్‌ లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు సినీ తారలు హాజరు అవుతూ ఉంటారు. అయితే అల్లు అర్జున్‌ వంటి పెద్ద స్టార్‌ హాజరు కానున్న నేపథ్యంలో ఆ ఈవెంట్‌కి హైప్‌ పదుల రెట్లు పెరుగుతుంది. తద్వారా నిర్వాహకులు ఆర్థికంగా మంచి లాభాలు దక్కించుకునే అవకాశం ఉంటుందని అంటారు. ఆ విషయం పక్కన పెడితే పుష్ప 2 వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అల్లు అర్జున్‌ హాజరు కాబోతున్న యూఎస్‌ తెలుగు అసోషియేషన్ ఈవెంట్‌ కావడంతో అభిమానులతో పాటు, ప్రతి ఒక్కరూ చాలా స్పెషల్‌గా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ ఈవెంట్‌ హిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

జులైలో జరిగే ఈవెంట్‌లో హాజరు అయ్యేందుకు అల్లు అర్జున్‌ ఓకే చెప్పిన నేపథ్యంలో AA22XA6 సినిమా గురించిన చర్చ మొదలు కానుంది. అట్లీ సినిమాను తక్కువ సమయంలో పూర్తి చేయాలని భావిస్తున్నాడు. జూన్‌ లేదా జులైలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఒకటి రెండు రోజుల పాటు యూఎస్‌కి వెళ్లి అల్లు అర్జున్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్‌ యూఎస్‌లోనే ఉంటాడేమో, అందుకే ఆ ఈవెంట్‌కి హాజరు అయ్యేందుకు ఓకే చెప్పి ఉంటాడేమో అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బన్నీ యూఎస్‌లో జరగబోతున్న ఆ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరు కావడం కన్ఫర్మ్‌ అయింది.