బన్నీ - త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్ పరిస్థితేంటీ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ 'పుష్ప 2' తో పతాక స్థాయికి చేరింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
By: Tupaki Desk | 10 Jun 2025 9:42 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ 'పుష్ప 2' తో పతాక స్థాయికి చేరింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రిలీజ్ టైమ్‌లో తెలుగు రాష్ట్రాల్లో వివాదాల కారణంగా హాట్ టాపిక్‌గా నిలిచిన ఈ మూవీ ఓ సంఘటనతో వైరల్డ్ వైడ్‌గా వైరల్‌గా మారడం తెలిసిందే. ఆ క్రేజ్‌తో ఈ సినిమా అనుకున్న దానికి మించి వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో రూ.1800 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి బన్నీ కెరీర్‌తో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది.
ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ తరువాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేశారు. దీన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే మైథలాజికల్ టచ్‌తో భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలనుకున్న ఈ ప్రాజెక్ట్‌కు మరింత సమయంపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బన్నీ తాజాగా మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ మూవీకి అల్లు అర్జున్ రెడీ అయ్యారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచక జరిగిపోతోంది. ఇప్పటికే హీరోయిన్ గా దీపికా పదుకునేని ఫైనల్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంతకీ బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉన్నట్టా లేనట్టా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, ఇక ఈ ప్రాజెక్ట్ లేనట్టేనని కూడా ప్రచారం మొదలైంది. అయితే యువ నిర్మాత, బన్నీకి అత్యంత సన్నిహితుడు బన్నీ వాసు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఉంటుందని, త్రివిక్రమ్, బన్నీ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఈ సినిమా మొదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు.
బన్నీ ప్రస్తుతం అట్లీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ టైమ్‌ని మరో ప్రాజెక్ట్‌కు వాడుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించిన టాక్స్ గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. దీని తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ 'పెద్ది' మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తయిన తరువాత త్రివిక్రమ్ మూవీ చేస్తాడట. ఈ లోపు అట్లీ ప్రాజెక్ట్‌ని బన్నీపూర్తి చేసి త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లోకి వచ్చేస్తాడట.