బన్నీ 22 లో హీరో విలన్ అతడేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రానికి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.
By: Tupaki Desk | 19 May 2025 11:20 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రానికి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈసారి అట్లీ సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఇప్పటివరకూ అట్లీలో ఒక యాంగిల్ మాత్రమే కనిపించింది. కానీ ఈసారి అట్లీలో కొత్త యాంగిల్ తెరపైకి తెస్తున్నాడు. టెక్నికల్ ఈ చిత్రాన్ని హైలైట్ చేయబోతున్నాడు.
బన్నీ పాన్ ఇండియా క్రేజ్ ని పాన్ వరల్డ్ కు రీచ్ అయ్యే కాన్సెప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు. ఇండియాలో ఎంస్ ఎస్ ఎంబీ 29 తర్వాత ఆ రేంజ్ బజ్ బన్నీ సినిమాకే కనిఇస్తుంది. ఇప్పటికే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇందులో బాలీవుడ్ భామల పేర్లు కూడా వినిపించాయి. మెయిన్ లీడ్ కోసం దీపికా పదుకోణేనే రంగంలోకి దించుతున్నట్లు వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా బన్నీ రోల్ కూడా ఛేంజ్ అయింది. ఇప్పటివరకూ బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కానీ బన్నీ పోషించేది డబుల్ రోల్ కాదు ట్రిపుల్ రోల్ అని తాజాగా వెలుగులోకి వస్తోంది. మూడు పాత్రల లుక్స్ కూడా రొటీన్ కు భిన్నంగా కొత్తగా ఉంటాయని సమాచారం. రెండు పాత్రలు పాజిటివ్ గా ఉన్నా మూడవ రోల్ మాత్రం నెగిటవ్ గా ఉంటుందని..అది ప్రతినాయకుడి పాత్ర అవ్వొచ్చని గెస్సింగ్స్ వస్తున్నాయి.
స్క్రిప్ట్ డిమాండ్ మేరకు హీరో విలన్ ఒక్కరే అయితే బాగుంటుందని అట్లీ భావిస్తున్నాడుట. మరి ఇందులో నిజమెంతో తేలాలి. ఇంత వరకూ ఇలాంటి అటెంప్ట్ లు బన్నీ కూడా చేయలేదు. `పుష్ప` సినిమాలో పేరుకే హీరో. క్యారేక్టరేజేషన్ పరంగా చూస్తే అది నెగిటివ్ రోల్ అవుతుంది. దీనిపై కొన్ని విమర్శలు కూడా వ్యక్తమైన సంగతి తెలిసిందే.
