ప్లాపైన కూడా అల్లు అర్జున్ ఆ మూవీ చేసి ఉంటే బాగుండేదా? అప్పట్లోనే ఉత్తమ నటుడిగా మారేవాడా...
ఇక 'ఆర్య' సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన ఆ సినిమాలోని డ్యాన్స్ తో ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు.
By: Tupaki Desk | 23 Sept 2026 12:00 AM ISTగంగోత్రి' సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ మొదటి సినిమా సక్సెస్ అయిన కూడా అతనికి ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఇక 'ఆర్య' సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన ఆ సినిమాలోని డ్యాన్స్ తో ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. సుకుమార్ రాసిన డైలాగులు, అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అన్ని ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇక ఆ తర్వాత చేసిన 'బన్నీ' సినిమాతో అల్లు అర్జున్ మరోసారి ఒక డీసెంట్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ క్రమంలో సుకుమార్ తన రెండో సినిమాను ఎవరితో చేయాలి అనే ఆలోచనలో పడ్డప్పుడు 'జగడం' సినిమా కథని అల్లు అర్జున్ కి వినిపించాడు. మొదట అల్లుఅర్జున్ ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పటికి అందులో కొన్ని చేంజెస్ చేస్తే తను తప్పకుండా ఆ సినిమా చేస్తానని చెప్పారట. కానీ ఆ చేంజెస్ చేయడానికి సుకుమార్ మాత్రం ఒప్పుకోలేదు. మొత్తానికైతే దిల్ రాజు ప్రొడక్షన్ లోనే అల్లు అర్జున్ హీరోగా 'జగడం' మూవీ తెరకెక్కాలి. అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అక్కడ వర్కౌట్ కాలేదు. దాంతో సుకుమార్ బయటికి వచ్చి అప్పుడే 'దేవదాస్' సినిమాతో సక్సెస్ ని సాధించిన రామ్ ను హీరోగా పెట్టి జగడం సినిమా చేశాడు.
ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికి సినిమాలోని మేకింగ్ కానీ, కథ కానీ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇప్పటికీ ఆ సినిమా గురించి ప్రతి ఒక్కరు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారంటే సుకుమార్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తోపాటు అతను ఆ రోజుల్లో రాసిన కథ కూడా ఆ సినిమా చాలా వరకు ప్లస్ అయింది. ఫైనల్ గా ఈ మూవీ క్లాసికల్ సినిమాల లిస్టులో నిలిచిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులు జగడం సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ సినిమాని అల్లు అర్జున్ చేసి ఉంటే బాగుండేదని అప్పట్లోనే ఆయనకి నటనలో మరింత పరిణితి వచ్చిండేదని ఆయన గొప్ప నటుడి గా పేరు సంపాదించుకునే వాడని మరికొంతమంది భావిస్తున్నారు.
నిజానికి జగడం సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మూవీలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. లవర్ గా, గల్లి రౌడీ గా నటించి మెప్పిస్తే అల్లు అర్జున్ కి మరింత గుర్తింపు వచ్చేది. అలాంటి సినిమా అప్పట్లో అల్లు అర్జున్ కి పడి ఉంటే ఆ సినిమా ఆడిన ఆడకపోయినా కూడా నటన విషయంలో అల్లు అర్జున్ టాప్ పొజిషన్ కి వెళ్లేవాడు.
అలాంటి సినిమాని ఎందుకు మిస్ చేసుకున్నావు అంటూ అల్లు అర్జున్ అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఆ సినిమా చేసి ఉంటే బాగుండేదని తను కూడా పలు సందర్భాల్లో తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ 'రాకా' సినిమాతో బిజీగా ఉన్నాడు. పుష్ప రెండు పార్టులతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన రాకా సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది...
