పుష్ప రాజ్ ని టార్గెట్ చేసిన ఏ.ఐ.ఎస్.ఎఫ్..!
ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏ.ఐ.ఎస్.ఎఫ్ పుష్ప హీరో అల్లు అర్జున్ హీరోయిన్ శ్రీలీల మీద క్రిమినల్ కేసు పెట్టాలని విజయవాడకి చెందిన సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 21 April 2025 10:00 PM ISTఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏ.ఐ.ఎస్.ఎఫ్ పుష్ప హీరో అల్లు అర్జున్ హీరోయిన్ శ్రీలీల మీద క్రిమినల్ కేసు పెట్టాలని విజయవాడకి చెందిన సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్, శ్రీలీల కార్పొరేట్ కాలేజ్ లకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని ఏ.ఐ.ఎస్.ఎఫ్ సభ్యులు చెప్పుకొచ్చారు. జే.ఈ.ఈ మెయిన్ లో టాప్ ర్యాంకర్ల ఫోటోలను వేరువేరు కాలేజీలు వేశారని వెల్లడించారు.
ఒకే స్టూడెంట్ పేరుని రెండు కాలేజీలు వేస్తున్నారని అలాంటి వాటి వల్ల స్టూడెంట్స్ జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. దీనికి కారణమైన ఇలాంటి కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటున్న వారిని కూడా వదలకూడదని అంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్, శ్రీలీల ఇద్దరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని ఏ.ఐ.ఎస్.ఎఫ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
స్టార్ హీరోగా అల్లు అర్జున్ క్రేజ్ ని వాడుకునేందుకు కొన్ని కాలేజీలు అతనితో బ్రాండింగ్ చేయిస్తున్నారు. ఐతే జే.ఈ.ఈ మెయిన్ ర్యాంకుల్లో ఒకే విద్యార్థి పేరుని వేర్వేరు కాలేజీలు వేయడం ఏంటంటూ ఏ.ఐ.ఎస్.ఎఫ్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఐతే దీనికి సంబంధం ఉన్నా లేకపోయినా సరే ఇలాంటి కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ స్టూడెంట్స్ ని మిస్ గైడ్ చేస్తున్నట్టుగా భావించి అల్లు అర్జున్, శ్రీలీల మీద క్రిమినల్ కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఐతే పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఈమధ్య ఏం చేసినా పెద్దగా కలిసి రావట్లేదు. ముఖ్యంగా పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం పోగా ఒక బాబు కూడా హాస్పిటల్ పాలయ్యాడు. ఆ టైం నుంచి అల్లు అర్జున్ మిగతా విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తున్నాడు. ఐతే ఊహించని విధంగా ఏ.ఐ.ఎస్.ఎఫ్ విజయవాడ నుంచి క్రిమినల్ కేసు వేయాలని డిమాండ్ రావడం తో బన్నీ కాంపౌండ్ ఒకింత షాక్ కి గురైంది.
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ఒక అనౌన్స్ మెంట్ వీడియో ఈమధ్యనే రిలీజైంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తుంది.
