బన్నీ 30 రోజుల ట్రైనింగ్ ముగించి దిగాడు!
ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాస్ ఓ ఇంటరాక్షన్ లో రివీల్ చేసారు.
By: Tupaki Desk | 3 March 2025 1:13 PMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా విషయంలో క్లారిటీ రాని సంగతి తెలిసిందే. అట్లీతో ముందుగా మొదలువుతుందా? త్రివిక్రమ్ తో మొదలవుతుందా? అన్న దానిపై రెండు నెలలుగా కొలిక్కి రాని అంశంగా మారింది. ఈ నేపథ్యంలో బన్నీ విదేశాల్లో ఓ స్పెషల్ ట్రైనింగ్ ముగించుకుని హైదరాబాద్లో కొద్ది సేపటి క్రితమే ల్యాండ్ అయ్యాడు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాస్ ఓ ఇంటరాక్షన్ లో రివీల్ చేసారు.
తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరగా? బన్నీ ట్రైనింగ్ విషయం బయట పడింది. ఆయన ఎప్పుడూ నటన కు సంబంధించి కొత్త విషయాలు తెలుసుకోవడం, అందులో భాగంగా ట్రైనింగ్ తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఎప్పటి కప్పడు అప్డేట్ అవుతుంటారు. కొత్త విషయాలు తెలుసుకుం టాడు. నెల రోజుల పాటు విదేశాల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇది ఆయన ఖాళీగా ఉన్నప్పుడు జరిగే ప్రోసస్.
పాత విషయం కాదు అని బన్నీ వాస్ అన్నాడు. అలాగే తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ అన్నది వారి టీమ్ లు ఇస్తాయని బన్నీ వాస్ తెలిపాడు. ఈ సందర్భంగా బన్నీ నిత్యాన్వేషి అన్న సంగతి ఇప్పుడే బయట పడింది. సినిమా అయిపోయిందని రిలాక్స్ అయ్యే రకం కాదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ అప్ డేట్ అవ్వడం అన్నది బన్నీ ప్రత్యేకత. ఇలా హీరోలందరూ చేయలేరు. కొందరికి మాత్రమే సాధ్యం. ఆ విషయంలో బన్నీ ముందున్నాడని చెప్పాలి.
అయితే తాజాగా పూర్తి చేసిన నెల రోజుల ట్రైనింగ్ అట్లీ సినిమా కోసమా? గురూజీ సినిమా కోసమా? అన్నది తేలాలి. ఇప్పటికే బన్నీ అభిమానులంతా నరాలు తెగే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఐకాన్ స్టార్ ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెర దించుతాడో చూడాలి.