బన్నీ+రామ్ ఒకే నెంబర్!
ఒకే ఏడాది ఒకే నెంబర్ తో సినిమాలు పట్టాలెక్కడం అన్నది రేర్. చాలా అరుదుగునే ఇలాంటి యాదృ శ్చికం చోటు చేసుకుంటుంది.
By: Tupaki Desk | 27 April 2025 1:30 AMఒకే ఏడాది ఒకే నెంబర్ తో సినిమాలు పట్టాలెక్కడం అన్నది రేర్. చాలా అరుదుగునే ఇలాంటి యాదృ శ్చికం చోటు చేసుకుంటుంది. అందులోనూ స్టార్ హీరోల సినిమా నెంబర్లు ఇప్పుడు మరింత క్రేజీగా మారాయి. ఏ హీరో ఎన్నవ నెంబర్ తో సినిమా చేస్తున్నాడు? అన్న దానిపై ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి నెల కొంటుంది. హీరోలు సైతం వాటిపై అంతే ఆసక్తిగా ఉంటున్నారు. ప్రత్యేకంగా ఆ నెంబర్ ను లాంచింగ్ రోజున హైలైట్ చేస్తున్నారు.
ల్యాండ్ మార్క్ చిత్రాల విషయంలో అయితే ఆ నెంబర్ మరింత ప్రతిష్టాత్మకంగా మారుతుంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకే ఏడాది ఒకే నెంబర్ తో సినిమాలు చేయడానికి 2025 వేదిక అయింది. ప్రస్తుతం రామ్ పొతినేని ర్యాపో సినిమా ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కమర్శియల్ చిత్రమిది.
ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా నెంబర్ 22. ఈ చిత్రంపై రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియాలో సన్నాహాలు జరుతున్నాయి. `పుష్ప` ప్రాంచైజీ తర్వాత ఈ కాంబినేషన్ చేతులు కలపడంతో నెంబర్ ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఇప్పటికే ఏఏ 22 అంటూ నెట్టింట రచ్చ ఏ రేంజ్ లో జరుగుతుందో తెలిసిందే.
సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. జూన్ లో చిత్రాన్ని ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇలా బన్నీ సినిమా 22 కావడంతో రామ్ సినిమా నెంబర్ కూడా 22 క్రేజీగా మారింది. బన్నీ కారణంగా రామ్ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ దక్కుతుంది.