Begin typing your search above and press return to search.

రాజమౌళి అల్లు అర్జున్.. పదేళ్ల తర్వాతే..?

నాన్ రాజమౌళి మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప 1, 2 సినిమాలతో నేషనల్ లెవెల్ లో తన మాస్ విధ్వంసం సృష్టించాడు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 7:30 AM
రాజమౌళి అల్లు అర్జున్.. పదేళ్ల తర్వాతే..?
X

నాన్ రాజమౌళి మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప 1, 2 సినిమాలతో నేషనల్ లెవెల్ లో తన మాస్ విధ్వంసం సృష్టించాడు. పుష్ప రాజ్ పాత్రలో తన పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ బీ టౌన్ ఆడియన్స్ ని పిచ్చెక్కించేలా చేసింది. అందుకే అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మరో భారీ సినిమాకు లైన్ చేశాడు. ఆ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఇదో సూపర్ హీరో మూవీ అని అర్థమవుతుంది.

ఐతే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ పెడుతున్నారు. రాజమౌళి తో సినిమా చేయకుండానే నేషనల్ లెవెల్ లో తన టాలెంట్ చూపిస్తున్నాడు అల్లు అర్జున్. అలాంటి హీరోకి రాజమౌళితో సినిమా పడితే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఐతే రాజమౌళి అల్లు అర్జున్ ఈ కాంబో ఇప్పుడప్పుడే సాధ్యం కాదని తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అట్లీ సినిమా ఎలా ఏదన్నా 2 ఏళ్లు పడుతుంది.

అట్లీ తర్వాత అల్లు అర్జున్ తో సినిమాకు రెడీగా ఉన్నాడు త్రివిక్రం. మైథాలజీ కాన్సెప్ట్ లోనే డిఫరెంట్ మూవీగా అది రాబోతుందని తెలుస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ మొదలు పెడితే మరో 3 ఏళ్లు తీసుకోవడం పక్కా అని చెప్పొచ్చు. ఇక పుష్ప 3 కూడా ఆ తర్వాతే తెరకెక్కించే ఛాన్స్ ఉంది. కొరటాల శివ కూడా అల్లు అర్జున్ తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు. సో ఈ సినిమాల తర్వాత కొరటాల శివకు అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాడు.

సో ఈ ప్రాజెక్ట్ లు అన్నీ అయ్యే వరకు రాజమౌళి సినిమా ఉండే అవకాశం లేదు. ఇక రాజమౌళి సైడ్ నుంచి చూస్తే సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా కూడా మరో రెండేళ్లు పడుతుంది. సినిమా ఒక భాగం అయితే పర్వాలేదు లేదు రెండు భాగాలంటే మరో రెండేళ్లు అంటే అక్కడే 4 ఏళ్లు ఇచ్చేయాలి. ఆ నెక్స్ట్ రాజమౌళి మళ్లీ ఎన్ టీ ఆర్ తో ఒక ప్రాజెక్ట్, ప్రభాస్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఏ ఒక్కటి చేసినా దానికి 3 ఏళ్లు టైం పడుతుంది.

సో రాజమౌళి ఫ్రీ అవ్వాలంటే 7, 8 ఏళ్లు పట్టేలా ఉంది. ఈలోగా తను కమిటైన సినిమాలను కూడా పూర్తి చేసే సరికి ఎలా లేదన్నా రాజమౌళి అల్లు అర్జున్ కాంబో సినిమా రావాలంటే మాత్రం 10 ఏళ్లు టైం పడుతుందని తెలుస్తుంది. ఐతే ఎంత టైం పట్టినా కూడా జక్కన్నతో బన్నీ సినిమా పడితే మాత్రం ఆ సినిమా రికార్డులను తిరగరాస్తుందని అంటున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.