Begin typing your search above and press return to search.

హృతిక్ - ఎన్టీఆర్ ఉన్నా.. అల్లు అర్జున్ ను దాటలేకపోయారుగా..

అల్లు అర్జున్ పుష్ప 2- ఎన్టీఆర్ వార్ 2 రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే.

By:  M Prashanth   |   16 Aug 2025 1:08 PM IST
హృతిక్ - ఎన్టీఆర్ ఉన్నా.. అల్లు అర్జున్ ను దాటలేకపోయారుగా..
X

అల్లు అర్జున్ పుష్ప 2- ఎన్టీఆర్ వార్ 2 రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. బన్ని పుష్ప సినిమాతో, ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీంకో ఈ ఇద్దరికీ హిందీలో మంచి మర్కెట్ ఏర్పడింది. గతేడాది రిలీజైన పుష్ప 2 అంచనాలు అందుకొని హిందీలో భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఆ రికార్డులను ఎన్టీఆర్- హృతిక్ రోషన్ వార్ 2 బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

హిందీలో పుష్ప 2 బెంచ్‌ మార్క్‌ సెట్ చేసింది. ఇది తొలి రోజు హిందీలో రూ. 65 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా డే 1 వసూళ్లు రూ. 257 టచ్ చేసింది. అయితే ఈ రికార్డులు SPY యూనివర్స్ లో భాగంగా హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కొడుతుందని అనుకున్నారు. తొలి రోజు వార్ 2 హిందీలో రూ.60 కోట్లు కొల్లగొడుతుందని అనుకున్నారు. ఒకవేళ టాక్ పెద్దగా రాకపోయినా.. కనీసం రూ.50 కోట్లు హిందీలో వస్తాయని భావించారు.

అయితే, లో రేంజ్ ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకోకపోవడంతో సినిమాపై హైప్ తగ్గింది. ఎలాంటి బజ్ ఏర్పడలేదు. ఎంత బ్యాడ్ ఫేజ్ లో అయినా తక్కువలో తక్కువ హిందీలో రూ. 40 కోట్ల ఓపెనింగ్ ఆశించారు. తగ్గట్లుగానే అడ్వాన్స బుకింగ్స్ జోరు ప్రదర్శించినా.. వాస్తవంలో మాత్రం దెబ్బ తగిలింది. ఆశించిన స్థాయిలో వార్ 2 హిందీ కలెక్షన్లు రాలేదు.

ఇది మొదటి రోజు హిందీలో రూ. 28 నుండి రూ. 30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గిందనడానికి ఇదే నిదర్శణం. యశ్ రాజ్ ఫిల్మ్ సంస్థకు కూడా ఇది ఒక నిరాశే. ప్రపంచవ్యాప్తంగా పుష్ప డే 1 కలెక్షన్లలో 30 శాతం మాత్రమే వార్ 2 సాధించింది. ఇక హిందీలో ఇది 40 శాతం కంటే తక్కువ సాధించింది. ఇక తొలి రోజును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. పుష్ప 2 సినిమా, వార్ 2 పై మూడు రెట్లు ఆధిక్యంలో ఉంది.

భారీ అంచనాలు, స్టార్ హీరోలు, భారీ తారగణం, సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీతో నిర్మించిన ఈ చిత్రానికి, ఇలాంటి రిజల్ట్ రావడం ఇబ్బందికరమే. సీక్వెల్ అంటే పుష్ప 2 లాగా పవర్ ఫుల్ సీన్స్, కథ, కంటెంట్‌ ఉండాలి. అలా అయితేనే ప్రేక్షకులు ఒప్పుకుంటారు. అంతేకానీ తొలి పార్ట్ హిట్టైనందుకు సీక్వెల్ తీస్తే క్లిక్ కాదని వార్ 2 ఒక విధంగా హెచ్చరికగా గుర్తుండిపోతుందని చెప్పవచ్చు. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.