ప్రియమణికి ఐకాన్ స్టార్ ఛాన్స్ ఇచ్చాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు గ్లోబల్ మార్కెట్ నే టార్గెట్ చేసి బరిలోకి దిగుతున్నారు.
By: Tupaki Desk | 6 Jun 2025 2:30 AMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు గ్లోబల్ మార్కెట్ నే టార్గెట్ చేసి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఇరువురు 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. మార్కెట్ పరంగా బన్నీ మరింత ముందంజలో ఉన్నాడు. ఇప్పుడతడి టార్గెట్ ఏకంగా 2500 కోట్లపైనే గురి పెట్టాడు. అదీ అట్లీ సినిమాతోనే సాధ్యమయ్యేలా ఇరువురు ముదుకు కదులున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. సినిమా గ్రాండ్ గా లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఇందులో బన్నీకి జోడీగా ముగ్గురు భామల్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. గ్లోబల్ స్థాయిలో అప్పిరియన్స్ ఉండే నాయికల్నే పరిశీలిస్తున్నట్లు వినిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ లో ప్రియమణి ఓ కీలక పాత్రకు ఎంపిక చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అదే జరిగితే బన్నీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది. బన్నీ పాన్ ఇండియా స్టార్ కాక ముందు ఓ షోలో ప్రియమణి తనతో కలిసి నటించే ఛాన్స్ రాలేదని ఓపెన్ అయింది. ప్రతిగా బన్నీ తప్పకుండా కలిసి పనిచేద్దాం. ఇప్పటికీ హాట్ గానే ఉన్నారు. వయసేం అయిపోలేదు కదా? అన్నారు. అందుకు ప్రియమణి ఎంతో సంతోష పడింది. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తుంది.
ఇప్పుడు ఏకంగా గ్లోబల్ మూవీలోనే ఆ ఛాన్స్ కు సమీపంలో ఉంది. సినిమాలో ఏదైనా కీలక పాత్రకు ఆమె ను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అట్లీ కూడా ప్రియమణికి మంచి స్నేహితుడు. జవాన్ లో కూడా ఆమెకు కీలక పాత్ర ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ 22లో మరింత మంచి రోల్ వచ్చే అవకాశం ఉంది.