నీల్ తో మూవీ.. బన్నీ ప్లాన్ ఏంటి?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
By: M Prashanth | 21 April 2026 12:13 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ఆ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమా బన్నీ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అయితే రాకా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు బన్నీ సిద్ధమవుతున్నారు. లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అందువల్ల ఆ కాంబినేషన్ పై టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. ఆ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, చాలా రోజులుగా వార్తల్లో నిలుస్తున్న ప్రశాంత్ నీల్- బన్నీ కాంబినేషన్ మాత్రం వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న భారీ యాక్షన్ చిత్రం. ప్రస్తుతం శరవేగంగా ఆ సినిమా షూటింగ్ జరుగుతండగా.. అది పూర్తయ్యే వరకు ఆయన ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు.
మరోవైపు, అల్లు అర్జున్ కూడా వరుసగా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడంతో కాల్ షీట్ల సర్దుబాటు ఒక సవాల్ గా మారింది. అట్లీ, లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రశాంత్ నీల్- బన్నీ కాంబో కొంతకాలం వాయిదా పడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా సరే, ఆ కాంబినేషన్ పై అంచనాలు మాత్రం తగ్గడం లేదు.
అల్లు అర్జున్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రశాంత్ నీల్ మాస్ మేకింగ్ స్టైల్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి రావణం అనే వర్కింగ్ టైటిల్ తో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బన్నీ ఫ్యూచర్ ప్లాన్లను పరిశీలిస్తే, ఆయన తన మార్కెట్ ను మరింత విస్తరించడంపై ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ముంబైతో పాటు విదేశీ లొకేషన్లలో షూటింగ్స్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ముంబైలో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ఆయన స్ట్రాటజీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాకే ప్రశాంత్ నీల్- అల్లు అర్జున్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆ సినిమా ఎప్పుడు ప్రారంభమైనా అది పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అవుతుందనే నమ్మకం మాత్రం అభిమానుల్లో గట్టిగా ఉంది.
