Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ -బ‌న్నీ మ‌ధ్య‌లో ప్రశాంత్ నీల్!

ఆ ప్రాజెక్ట్ ఇదే ఏడాది మిడ్ లో ప్రారంభం కావాలి. అంటే జూలై లో మొద‌ల‌వ్వాలి. కానీ అందుకు ఛాన్స్ లేదు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 1:30 PM
ప్ర‌భాస్ -బ‌న్నీ మ‌ధ్య‌లో ప్రశాంత్ నీల్!
X

ప్ర‌భాస్ ప్రాజెక్ట్ బ‌న్నీ చేతుల్లోకి వ‌చ్చిందా? ఆ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడా? `స‌లార్ 2` కంటే ముందే ఈ చిత్రం మొద‌ల‌వుతుందా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. ఇదంతా తెలియాలంటే అస‌లు మ్యాట ర్లోకి వెళ్లాల్సిందే. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో `స‌లార్ 2` పూర్తి చేయాల్సి ఉంది. దీనికి సం బంధించి ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే వీళ్లిద్ద‌రితోనే దిల్ రాజు ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఆ ప్రాజెక్ట్ ఇదే ఏడాది మిడ్ లో ప్రారంభం కావాలి. అంటే జూలై లో మొద‌ల‌వ్వాలి. కానీ అందుకు ఛాన్స్ లేదు. 'పౌజీ', 'రాజాసాబ్' షూటింగ్ ల్లో ప్ర‌భాస్ ...'డ్రాగ‌న్' షూటింగ్ లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉంటే? ఇదెలా ప్రారంభ మ‌వుతంది. కానీ రాజుగారికి ప్ర‌భాస్- ప్ర‌శాంత్ నీల్ అలాగే క‌మింట్ మెంట్ ఇచ్చారు. దీంతో రాజుగారు ఇప్పుడు ఇందులో హీరోనే మార్చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు బ‌న్నీ చేతుల్లోకి వెళ్లింద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ 'డ్రాగ‌న్' షూట్ లో బిజీగా ఉన్నారు. ఈసినిమా చిత్రీక‌ణ డిసెంబ‌ర్ క‌ల్లా పూర్తి చేయాల‌న్న‌ది టార్గెట్. అలాగే ప‌ని చేస్తున్నారు. అటు బ‌న్నీ అట్లీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు క‌లిసి వ‌చ్చే ఏడాది మిడ్ లో దిల్ రాజు ప్రాజెక్ట్ ని ప్రారిభించాలనుకుంటున్నారుట‌. 2025 మిడ్ లో సాద్యం కానిది క‌నీసం వ‌చ్చే ఏడాది మిడ్ లోనైనా మొద‌లు పెట్టి ఇచ్చిన మాట‌కు నిల‌బ‌డాల‌ని నీల్ భావిస్తున్నారుట‌.

ప్ర‌భాస్ కు ఇత‌ర క‌మిట్ మెంట్లు ఉండ‌టంతో? సాధ్య‌ప‌డ‌ద‌ని భావించిన రాజుగారు ఇలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. బ‌న్నీ రోల్ కి సంబంధించి మేజ‌ర్ పార్ట్ షూటింగ్ అంతా మార్చి-ఏప్రిల్ కి పూర్త‌వుతుందిట‌. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ కూడా స‌మ్మ‌ర్ నుంచి ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్ కి డేట్లు కేటాయిస్తున్నాడ‌నే వార్త వినిపిస్తుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తేలాలి.