మెగాస్టార్ గురించి బన్నీ ఏమన్నాడంటే..?
లేటెస్ట్ గా వేవ సమ్మిట్ లో కూడా అల్లు అర్జున్ తనకు మామయ్య చిరంజెవి స్పూర్తి అని అన్నాడు.
By: Tupaki Desk | 2 May 2025 9:53 AM ISTఅల్లు అర్జున్ కి సొంతంగా స్టార్ ఇమేజ్ వచ్చాక కాస్త మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడన్న వార్త తెలిసిందే. ముఖ్యంగా తన ఫ్యాన్స్ కి అల్లు ఆర్మీ అంటూ పెట్టి అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ తనకు మాత్రమే ఆర్మీ ఉంటుందంటూ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ గురించి చేసే కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేశాయి. ఇక సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ ఫైట్ తెలిసిందే. ఐతే ఇన్ని ఉన్నా కూడా అల్లు అర్జున్ మాత్రం మెగాస్టార్ గురించి ఎప్పటిలానే తన ప్రేమని బయట పెడతాడు.
లేటెస్ట్ గా వేవ సమ్మిట్ లో కూడా అల్లు అర్జున్ తనకు మామయ్య చిరంజెవి స్పూర్తి అని అన్నాడు.తాతయ్య అల్లు రామలింగయ్య 1000 కి పైగా సినిమాలు చేశారని.. నాన్న అల్లు అరవింద్ 70 సినిమాల దాకా నిర్మాతగా తీశారని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ఇక మెగాస్టార్ చిరంజీవి తనకు స్పూర్తి అని ఆయన ప్రభావం తన మీద చాలా ఉంటుందని అన్నాడు అల్లు అర్జున్.
ఈమధ్య ఈవెంట్స్ లో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎక్కడ ప్రస్తావించలేదని అనుకున్నారు. కానీ కావాల్సిన చోట కావాల్సిన టైం లో చిరంజీవి మీద తనకున్న ప్రేమ అభిమానం చూపిస్తున్నాడు అల్లు అర్జున్. వేవ్స్ సమ్మిట్ లో స్టార్స్ అంతా కూడా తమకు స్పూర్తినిచ్చిన విషయాల గురించి చెప్పుకొచ్చారు.
చిరంజీవి కూడా తన సీనియర్స్ ని చూసి స్పూర్తి పొందానని ముఖ్యంగా డాన్స్ లు అయితే కమల్ హాసన్ ని చూసి ఇన్ స్పైర్ అయ్యానని చెప్పారు. అల్లు అర్జున్ కూడా మామయ్య చిరంజీవి ప్రభావం తన మీద ఉంటుందని చెప్పాడు. చిరంజీవిని చూసే చాలామంది హీరోలు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు. ఈ జనరేషన్ హీరోలందరికీ ఆయన ఒక స్పూర్తి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే అల్లు అర్జున్ చిరంజీవి గురించి చెప్ప్పడంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా చిరు మీద బన్నీ అభిమానం మాత్రం అలానే ఉందని చెప్పొచ్చు. మరి అల్లు అర్జున్ కామెంట్స్ కి మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటన్నది చూడాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో తన నెక్స్ట్ సినిమా కన్ ఫర్మ్ చేశాడు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది.
