Begin typing your search above and press return to search.

మళ్లీ కలుద్దామా..? అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న పూజ హెగ్డే

ఈ క్రమంలో పూజా హెగ్డే.. అల్లు అర్జున్ కోసం పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

By:  Tupaki Desk   |   23 July 2025 11:35 AM IST
మళ్లీ కలుద్దామా..? అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న పూజ హెగ్డే
X

ఒకప్పుడు గోల్డెన్ లెగ్ గా పిలవబడిన.. హీరోయిన్ పూజ హెగ్డే…అలా వైకుంఠపురంలో, అరవింద సమేత లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. అయితే గత కొద్ది రోజుల నుంచి..మాత్రం ఈ హీరోయిన్ కెరియర్ అంత సాఫీగా సాగడం లేదు. వరుస ఫ్లాపులతో తెగ సతమతమవుతోంది ఈ బుట్ట బొమ్మ. ఈ మధ్య విడుదలైన సూర్య సినిమా రెట్రో.. పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం సైతం.. డిజాస్టర్ గా నిలిచింది.


చిరంజీవి ఆచార్య,‌ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా దగ్గర నుంచి.. నిన్న మొన్నటి వరకు విడుదలైన పూజ సినిమాలు అన్నీ కూడా.. వరుస ప్లాపులుగా నిలిచాయి. ఇక దీంతో మంచి అవకాశాల కోసం తెగ ఎదురుచూస్తోంది ఈ హీరోయిన్.

ఈ క్రమంలో పూజా హెగ్డే.. అల్లు అర్జున్ కోసం పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అసలు విషయానికి వస్తే.. అల్లు అర్జున్, పూజ హెగ్డే కలిసి నటించిన అలా వైకుంఠపురంలో.. చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కన్నా ముందు.. ఈ ఇద్దరి జంట డీజే సినిమాతో.. అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరితో కలిసి పూజా హెగ్డే.. తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఒక ఫోటో పెట్టింది. పక్కన హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్ తో పెట్టుకొని ఫోటో తీసుకున్న పూజ పాప.. దానికి క్యాప్షన్ గా.. “మళ్లీ డీజే రి యూనియన్ కి ఛాన్స్ ఉందా.. అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నావు..?” అంటూ బన్నీని ట్యాగ్ చేసింది.

ఇక ఈ పోస్ట్ చూడగానే.. అల్లు అర్జున్ అభిమానులు తెగ మురిసిపోయారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటి అంటే వెంటనే అల్లు అర్జున్.. ‘నెక్స్ట్ టైం తప్పకుండా’ అంటూ రిప్లై ఇచ్చేసారు. దీంతో హరీష్ శంకర్.. ఏమన్నా.. డీజే సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా అంటూ అభిమానులు కామెంట్స్ పెట్టసాగారు. మొత్తానికి పూజ పెట్టిన పోస్ట్.. దానికి అల్లు అర్జున్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటోంది.