బన్నీకి జోడీగా ఆ హీరోయిన్..
యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఫైనల్ అయిందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 25 April 2025 1:30 PMపుష్ప2తో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో విపరీతంగా క్రేజ్ ను పెంచుకున్న బన్నీ, తన తర్వాతి సినిమాను జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను దర్శకత్వం వహించిన అట్లీ కుమార్ తో చేయనున్నాడనే విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమాను మొన్న బన్నీ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ కూడా చేశారు.
ప్రస్తుతం బన్నీ పుష్ప2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ, అట్లీతో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడు. అవసరమైతే ముంబై వెళ్తూ సినిమాకు కావాల్సిన పనులన్నింటినీ చక్కబెట్టుకుంటున్న బన్నీ ఇప్పటికే ఈ సినిమా కోసం అట్లీ తో కలిసి లుక్ టెస్ట్ ను కూడా కంప్లీట్ చేసుకున్నాడనే విషయం తెలిసిందే.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఫైనల్ అయిందని తెలుస్తోంది. గురువారం మృణాల్ ఠాకూర్ కు లుక్ టెస్ట్ నిర్వహించారని, ఆమె లుక్ తో చిత్ర యూనిట్ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారని, త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుందని సమాచారం.
మొత్తం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని ఇప్పటికే వార్తలొస్తున్నాయి. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయని, ఆల్మోస్ట్ ఆ డిస్కషన్స్ కూడా ఆఖరి దశకు చేరుకున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి మూడో హీరోయిన్ గా ఎవరు కనిపించనున్నారనేది ఇంకా తెలియలేదు.
జూన్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు అన్ని విషయాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించిందే అవకాశముంది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా కోసం లాస్ ఏంజిల్స్ నుంచి ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలను అట్లీ రంగంలోకి దించాడు.