బన్నీ టార్గెట్ 2 వేల కోట్లు.. అలా చేస్తే కొట్టొచ్చు!
దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు రూ. 2 వేల కోట్ల క్లబ్ పై గురి పెట్టాడు. ఆయన ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నారు. దీనికి ఐకాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.
By: Tupaki Desk | 18 July 2025 3:31 PM ISTఒకప్పుడు సినిమాల్లో రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకోవడం గగనమే. కానీ, అందతా ఒకప్పటి మాట. ఈ రోజుల్లో బడా హీరోల సినిమాలకు ఓపెనింగ్ డే వసూళ్లే రూ.100 కోట్ల టార్గెట్. ఇక లాంగ్ రన్లో రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు అనే మాటలే వినిపిస్తున్నాయి.
అలా బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇప్పటికే దంగల్ సినిమాతో రూ.2 వేల కోట్లు వసూల్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ లో అత్యధిక కలెక్షన్ రికార్డ్ సెట్ చేశారు. ఇక తెలుగు ఇండస్ట్రీ హిట్లు బాహుబాలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప 2 సినిమాలు దీన్ని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాయి. కానీ, బాహుబలి రూ1800, పుష్ప 1600 కోట్ల వద్దే ఆగిపోయాయి.
దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు రూ. 2 వేల కోట్ల క్లబ్ పై గురి పెట్టాడు. ఆయన ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నారు. దీనికి ఐకాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. రూ.500కోట్లు అని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా రూ.2 వేల కోట్ల కలెక్షన్లు సాధించాలని మూవీటీమ్ లక్ష్యంగా పెట్టుకుందట.
అయితే టార్గెట్ పెట్టుకోగానే అయిపోతుందా? దానికి తగ్గట్లు పని చేయాలి కదా. రూ.2000 కోట్లు రాబట్టాలంటే బాలీవుడ్ తోపాటు, ఓవర్సీస్ లోనూ హైప్ క్రియేట్ చేయాలి. అయితే పుష్ప సినిమాతో బన్నీకి హిందీలో బాగానే మార్కెట్ ఉంది. కాకపోతే ఓవర్సీస్ మార్కెట్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. జపాన్, కెనడా లాంటి దేశాల్లో మంచి వసూళ్లు సాధించాలి. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు దేశం బౌండరీలు దాటి ఓవర్సీస్ లోనూ అదరగొట్టాయి.
ఇప్పుడు బన్నీ సినిమా కూడా అదే స్థాయిలో ఓవర్సీస్ లో మార్కెటింగ్ చేయాసి. ఇక పుష్ప సినిమా విషయంలో మేకర్స్ నార్త్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐకానిక్ తగ్గేదేలే మేనరిజంతో ఫుల్ హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు అట్లీ సినిమాకు కూడా అలాంటి హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమా ప్రమోషన్లకే రూ.100 బడ్జెట్ అంటున్నారు. అలా పుష్ప రేంజ్ లో ప్రమోషన్స్ చేయగలిగితే రూ.2 వేల కోట్లు మార్క్ అందుకునే ఛాన్స్ ఉంటుంది.
