Begin typing your search above and press return to search.

బ‌న్నీ లుక్ ఫిక్స్ చేసిన‌ట్టేనా?

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అట్లీతో అఫీషియ‌ల్ గా స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే బ‌న్నీ ముంబై వెళ్లిన విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 April 2025 12:47 PM IST
Allu Arjun Look Test
X

పుష్ప‌2 సినిమాతో రికార్డులు సృష్టించే విజ‌యాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌ర్వాతి సినిమాను ఎవ‌రితో చేస్తాడా అనుకుంటున్న టైమ్ లో జ‌వాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను తెర‌కెక్కించిన‌ డైరెక్ట‌ర్ అట్లీతో సినిమాను క‌న్ఫ‌ర్మ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అట్లీతో అఫీషియ‌ల్ గా స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే బ‌న్నీ ముంబై వెళ్లిన విష‌యం తెలిసిందే.

ఈ మ‌ధ్య బ‌న్నీ ఎప్పుడు ముంబై వెళ్లినా అది అట్లీతో చేస్తున్న సినిమా కోస‌మేన‌ని అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. తాజాగా బ‌న్నీ వెళ్లింది కూడా అందుకే. బాంద్రాలోని మెహ‌బూబ్ స్టూడియోస్ లో ఆదివారం బ‌న్నీకి లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫోటోషూట్ చేశార‌ని బాలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి. మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు మొద‌లైన ఈ సెష‌న్ సాయంత్రం వ‌ర‌కు కొన‌సాగింద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతుంది.

సినిమా కోసం అల్లు అర్జున్ లుక్ ను అట్లీ ఎన్నో ర‌కాలుగా ట్రై చేశాడ‌ని, ర‌గ్గ్‌డ్ లుక్ నుంచి నార్మ‌ల్ లుక్ వ‌ర‌కు ప్ర‌తీదీ ట్రై చేశార‌ని తెలుస్తోంది. పుష్ప సినిమాతో బ‌న్నీ ఆల్రెడీ ఓ స్ట్రాంగ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ అట్లీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ట్రై చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. అల్లు అర్జున్ ఈ లుక్ టెస్ట్ లో చాలా బాగా ఇన్వాల్వ్ అయి మ‌రీ పార్టిసిపేట్ చేసిన‌ట్టు చెప్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కైతే అల్లుఅర్జున్-అట్లీ సినిమా స్టోరీ, బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది తెలియ‌లేదు కానీ ఈ సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్క‌నుంద‌నైతే వార్త‌లొస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ షూట్ లో సినిమాలోని ఓ కీల‌క అంశం కోసం 12 ఏళ్ల పిల్ల‌ల‌ను కూడా సెలెక్ట్ చేశార‌ని తెలుస్తోంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే అట్లీతో బ‌న్నీ చేయ‌బోయే సినిమా జూన్ నెలాఖ‌రు నుంచే సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. పుష్ప త‌ర్వాత బ‌న్నీ నుంచి రానున్న సినిమా కావ‌డం, దానికి అట్లీ డైరెక్ట‌ర్ కావ‌డంతో ఈ సినిమాపై ఇప్ప‌టినుంచే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.