బన్నీ ఫారిన్ ట్రిప్స్.. ఆ ట్రీట్మెంట్ కోసమేనా?
పుష్ప సినిమాలతో ఇండియా వైడ్ గా పాపులర్ అయారు అల్లు అర్జున్. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో కనపించినప్పటికీ ఆయన లుక్స్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి.
By: Tupaki Desk | 22 July 2025 4:23 PM ISTపుష్ప సినిమాలతో ఇండియా వైడ్ గా పాపులర్ అయారు అల్లు అర్జున్. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో కనపించినప్పటికీ ఆయన లుక్స్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ పాత్ర కోసం దాదాపు మూడున్నర సంవత్సరాలకు పైగా కష్టపడ్డారు. అంతటి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కించుకున్నారు. ఇక ఆయన ప్రస్తుతం అట్లీతో సినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలో ఆయన లుక్స్ గ్రాండ్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే బన్నీని అట్లీ మెకోవర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బన్నీ బయట కనిపిస్తున్న లుక్స్ దీనికి ప్రత్యేక ఉదాహరణ. ఈ లుక్స్ పూర్తిగా పుష్ప సినిమాకు డిఫరెంట్ గా ఉన్నాయి. స్టైలిష్ లుక్ తో హ్యాండ్ సమ్ గా యవ్వనంగా కనిపిస్తున్నారు. అలా బన్నీ న్యూ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
అయితే బన్నీ కొత్త లుక్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు మరికొన్ని ఊహాగానాలకు దారితీసింది. అల్లు అర్జున్ తన ఫేస్ లుక్ ను మెరుగుపరచుకోవడానికి విదేశాలలో కాస్మెటిక్ మేకప్ చేయించుకున్నాడా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల బన్నీ ఫొటో ఒకటి ఆన్ లైన్‌లో వైరలైంది. అయితే బన్నీ ఇంటర్నేషనల్ క్లినిక్ ల్లో ట్రీట్ మెంట్ చేసుకొని ఇలా స్మార్ట్ గా తయారై ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయన తరచూ విదేశాలకు వెళ్తున్నారని అంటున్నారు.
అయితే అల్లు అర్జున్‌కు సన్నిహిత వర్గాలు ఈ కామెంట్స్ ను కొట్టి పారేశాయి. అతడి విదేశీ ట్రిప్ లు కేవలం ఫ్యామిలీ టూర్సే నని ఎలాంటి చికిత్స కోసం కాదని క్లారిటీ ఇచ్చాయి. పుష్ప 2 అవతార్ నుండి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత, ఆయన పాత స్టైలిష్ లుక్ లోకి వచ్చేశారని అన్నారు. అందుకే లుక్స్ అలా మెరుగయ్యాయని చెబుతున్నారు. ఈ లెక్కన బన్నీ హ్యాండ్సమ్ గా కనిపించడం వెనుక ఎలాంటి రహస్యాలు లేవని అర్థమవుతోంది.
కాగా, ప్రస్తుతం అట్లీ సినిమా కోసం బన్నీ లుక్ టెస్టు నడుస్తుంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ రూ.800 కోట్ల బడ్జెత్ తో రూపొందుతోంది.
