Begin typing your search above and press return to search.

బ‌న్నీ-నాగ చైత‌న్య భారీగా పెంచెస్తున్నారా?

పాత్ర‌కు త‌గ్గ‌ట్టు హీరోలు మౌల్డ్ అవ్వాలి. గెట‌ప్ లు చేంజ్ అవుతుండాలి. అందుకోసం శారీర‌కంగా....హెయిర్ స్టైల్ ప‌రంగా చాలా ర‌కాల మార్పులు తీసుకురావాలి.

By:  Tupaki Desk   |   5 Jun 2025 10:00 PM IST
బ‌న్నీ-నాగ చైత‌న్య భారీగా పెంచెస్తున్నారా?
X

పాత్ర‌కు త‌గ్గ‌ట్టు హీరోలు మౌల్డ్ అవ్వాలి. గెట‌ప్ లు చేంజ్ అవుతుండాలి. అందుకోసం శారీర‌కంగా....హెయిర్ స్టైల్ ప‌రంగా చాలా ర‌కాల మార్పులు తీసుకురావాలి. ఇప్ప‌టికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం ఎంత‌గా శ్రమిస్తున్నాడో తెలిసిందే. శారీర‌కంగా క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. అలాగే హెయిర్ ప‌రంగానూ బ‌న్నీ స‌రికొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. అందుకోసం భారీ గా హెయిర్ పెంచుతున్నాడు.

గ‌త సినిమా 'పుష్ప‌'లో హెయిర్ పెంచాడు. ఆ లుక్ చాలా మాస్ గా ఉంటుంది. అందులో చిత్తూరు నేప‌థ్యానికి త‌గ్గ‌ట్టు మౌల్డ్ అయ్యాడు. కానీ అట్లీ సినిమా కోసం మాత్రం డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్ లో క‌నిపించ నున్నాడుట‌. దీనిలో భాగంగా లాంగ్ హెయిర్ లుక్ లో క‌నిపిస్తాడ‌ని సమాచారం. ప్ర‌ధానంగా రెండు ర‌కాల లుక్స్ హైలైట్ అవుతాయంటున్నారు. ఒక‌టి పోనీ టెయిల్ లుక్ అంటే చిన్న పిల‌క‌లా ఉంటుంది.

ఇంత వ‌ర‌కూ ఈ లుక్ ను ఐకాన్ స్టార్ ట్రై చేయ‌లేదు. తొలిసారి ఆ ఛాన్స్ తీసుకుంటున్నాడు. మ‌రో లుక్ లో లాంగ్ హెయిర్ తో జ‌డ అల్లిన‌ట్లు క‌నిపిస్తాడుట‌. అందుకోసం ప్ర‌త్యేకంగా విదేశాల నుంచి హెయిర్ స్టైలిష్ ని రంగంలోకి దించుతున్నారుట‌. ఆ లుక్ కి సంబంధించిన కావాల్సిన హెయిర్ సిస్ట‌మ్ అంతా తానే ఇండియాకు తీసుకొస్తున్న‌ట్లు స‌మాచారం. అలాగే యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మిస్లిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో చైత‌న్య లాంగ్ హెయిర్ స్టైల్లో క‌నిపించ‌నున్నాడుట‌. 'తండేల్' సినిమా కోసం హెయిర్ పెంచిన సంగ‌తి తెలిసిందే. కొత్త సినిమాలో పూర్తిగా లాంగ్ హెయిర్ తో క‌నిపిస్తాడ‌ని ..అవ‌స‌రం మేర విగ్గులు కూడా వాడుతున్న‌ట్లు తెలిసింది. సినిమాలో పాత్ర అంత స్ట్రాంగ్ గా హెయిర్ లుక్ ని డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇంత వ‌ర‌కూ చైత‌న్య లాంగ్ హెయిర్ లుక్ లో క‌నిపించని సంగ‌తి తెలిసిందే.