Begin typing your search above and press return to search.

బ‌న్నీతో సినిమా..స్టార్ డైరెక్ట‌ర్‌కు టఫ్ టాస్కే!

ఇదిలా ఉంటే దీని త‌రువాత బ‌న్నీ ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్ల పేర్లు వినిపించాయి.

By:  Tupaki Desk   |   9 Jan 2026 1:00 AM IST
బ‌న్నీతో సినిమా..స్టార్ డైరెక్ట‌ర్‌కు టఫ్ టాస్కే!
X

పుష్ప సినిమాతో బ‌న్నీ పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేరిపోయాడు. ప్ర‌భాస్ త‌రువాత ఈ స్థాయిలో బాక్సాఫీస్‌ని ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్, మ‌హేష్‌బాబు ప్ర‌భావితం చేస్తార‌ని అంతా ఊహించారు. కానీ వారిని వెన‌క్కి నెట్టి `పుష్ప 2`తో అసాధ్యం అన్న రికార్డుని సుసాధ్యం చేసి చూపించాడు. `పుష్ప 2` వ‌ర‌ల్డ్ వైడ్‌గా వైల్డ్ ఫైర్‌ని చూపించి రూ.1600 కోట్ల‌కు పైనే రాబ‌ట్ట‌డంతో ప్ర‌భాస్ త‌రువాత ఆ ఘ‌న‌త సాధించిన సౌత్ స్టార్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా వైడ్‌గా `పుష్ప 2` బ‌న్నీ చేసిన హంగామా అంతా ఇంత కాదు. దీంతో ఆయ‌న త‌దుప‌రి సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

`పుష్ప 2` వంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత అల్లు అర్జున్ పాన్ వ‌ర‌ల్డ్ స్థాయి మూవీకి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీతో బ‌న్నీ త‌న 22వ ప్రాజెక్ట్‌ని ఇటీవ‌లే మొద‌లు పెట్టాడు. `AA22XA6` అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో దీన్ని రూపొందిస్తున్నారు. హాలీవుడ్ సూప‌ర్ హీరో త‌ర‌హాలో సాగే ఈ మూవీకి హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు. బ‌న్నీ సినిమాల్లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీని ద‌ర్శ‌కుడు అట్లీ ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌పైకి తీసుకొస్తున్నారు.

ఇదిలా ఉంటే దీని త‌రువాత బ‌న్నీ ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్ల పేర్లు వినిపించాయి. ఫైన‌ల్‌గా లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మాన‌గ‌రం, ఖైదీ వంటి రియ‌లిస్టిక్ సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా లోకేష్ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. ఆ త‌రువాత ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో చేసిన `మాస్ట‌ర్` కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేదు అనిపించినా `లియో` మాత్రం పూర్తిగా నిరాశప‌రిచింది. .

ఇక `విక్ర‌మ్‌` క‌మ‌ల్ కెరీర్ ని మ‌ళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది.

అయితే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో చేసిన `కూలీ` డిజాస్ట‌ర్ కావ‌డంతో లోకేష్ పై తీవ్ర విమ‌ర్శ‌లొచ్చాయి. దీంతో త‌న‌ కెరీర్ ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డింది. ఇలాంటి స‌మ‌యంలో అల్లు అర్జున్ - లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు చేయూతనిస్తున్నాడ‌ని, త‌న‌తో భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుడుతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని, షూటింగ్ కూడా వెంట‌నే మొద‌ల‌వుతుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇదే నిజ‌మైతే లోకేష్ క‌న‌గ‌రాజ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిల‌వ‌నుంది.

క‌ష్ట‌కాలంలో లోకేష్‌కు బ‌న్నీ ఈ ప్రాజెక్ట్‌తో అండ‌గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు షికారు చేస్తున్న నేప‌థ్యంలో నెట్టింట ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు ఈ ప్రాజెక్ట్ ట‌ఫ్ టాస్కేన‌ని అయితే దాన్ని క‌రెక్ట్‌గా యూజ్ చేసుకుని అల్లు అర్జున్ ప్యాష‌న్‌, క్యారెక్ట‌ర్ కోసం శ్ర‌మించే త‌త్వాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ బ‌ల‌మైన క‌థ‌ని ఎంచుకుంటే మంచిద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన త‌ప్పుల‌ని మ‌ళ్లీ పున‌రావృతం చేయ‌కుండా ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని అందించి బ‌న్నీ న‌మ్మ‌కాన్ని నిజం చేయాల‌ని అంతా కోరుకుంటున్నారు. `పుష్ప 2` త‌రువాత ఐకాన్ స్టార్ త‌న పంథా మార్చుకున్నాడు. ప్ర‌తీదీ హైలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

దాని కోసం ఎంత వ‌ర‌కైనా వెళ్ల‌డానికి సిద్ద‌ప‌డుతున్నాడు. సినిమాకు సంబంధించిన ప్ర‌తి విష‌యంలోనూ క్లారిటీ కోసం త‌పిస్తున్నాడు. అలాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా అంటే లోకేష్ పూర్తి స్థాయిలో త‌న సామ‌ర్థ్యాన్ని బ‌య‌టికి తీసి అందివ‌చ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకుని లోకేష్ అత్యుత్త‌మ‌మైన మూవీని అందించాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ లోకేష్‌కు అత్యంత ట‌ఫ్ టాస్క్‌గా మారుతుంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.