Begin typing your search above and press return to search.

ఆగిపోయిన అల్లు అర్జున్ కథ.. మరో హీరోతోనే..

ఇదే సమయంలో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఐకాన్ ప్రాజెక్ట్ ఇంకా ప్లానింగ్ లోనే ఉందని ప్రకటించారు. అయితే ఇందులో అల్లు అర్జున్ ఉండడు అని క్లియర్‌గా చెప్పారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 5:26 PM
ఆగిపోయిన అల్లు అర్జున్ కథ.. మరో హీరోతోనే..
X

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప 2 సినిమా ఏకంగా 1800 కోట్ల మార్క్ ను చేరడంతో నెక్స్ట్ సినిమాలు అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అట్లీ సినిమా 800 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. అయితే గతంలో అల్లు అర్జున్ కోసం అనుకున్న కథ ఇప్పుడు మరో హీరో వద్దకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్‌తో ఎప్పుడో ప్రకటించిన ఐకాన్ సినిమా మళ్లీ ఒక్కసారిగా చర్చలోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మొదటి ఎనౌన్స్ మెంట్ 2019లో వచ్చింది. ఎంసీఏ తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు కలసి ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. అయితే అప్పుడే పవన్ కళ్యాణ్ కోసం రూపొందించిన ‘వకీల్ సాబ్’ లైన్ లోకి వచ్చింది. అలా ఐకాన్ ఆలస్యం కావడం మొదలైంది.

ఆ టైమ్ లోనే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ అనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకుని తన కెరీర్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు. దాంతో ‘పుష్ప’లో అడుగు పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ తొలుత ఒకే పార్ట్ గా ప్లాన్ అయినా, ఆ తరువాత అది రెండు భాగాలుగా మారింది. దీంతో బన్నీ ఏళ్ల తరబడి పుష్ప ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యాడు. ఈ గ్యాప్‌లో ఐకాన్ సైలెంట్ ఫైల్‌లలోకి వెళ్లిపోయింది. దిల్ రాజు మొదట తాము బన్నీ కోసం ఎదురు చూస్తామని భావించినా, బన్నీ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి కనిపించడంతో మార్గం మార్చాల్సి వచ్చింది.

వేణు వెంటనే నితిన్‌తో తమ్ముడు అనే సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఈ సినిమా జూలై 4న విడుదల కాబోతుంది. ఇదే సమయంలో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఐకాన్ ప్రాజెక్ట్ ఇంకా ప్లానింగ్ లోనే ఉందని ప్రకటించారు. అయితే ఇందులో అల్లు అర్జున్ ఉండడు అని క్లియర్‌గా చెప్పారు. ఇది యాక్షన్ డ్రామా నేపథ్యంలో, హ్యూమన్ ఎమోషన్స్ తో మిక్స్ అయ్యే కథ అని వివరించారు. అయితే ఇందులో హీరోగా ఎవరుంటారు అనే విషయాన్ని మాత్రం ఆయన బయటపెట్టలేదు.

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం, దిల్ రాజు ఇప్పుడు ఐకాన్ కు కొత్త కథానాయకుడిని ఎంపిక చేయబోతున్నారట. బన్నీతో మాత్రం మరో భారీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ జరుగుతోంది. ఇది 2026లో సెట్స్‌పైకి వెళ్లి, 2027 లేదా 2028లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో త్రివిక్రమ్ రూపొందించనున్న మురుగన్ ప్రాజెక్ట్ మొదట బన్నీతో అనుకున్నప్పటికీ, చివరికి ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పుడు అసలు ప్రశ్న.. ఐకాన్లో హీరో ఎవరు? నితిన్‌, నాని పేర్లు ఒకానొక సమయంలో చర్చల్లోకి వచ్చినా.. ఇప్పటికీ అధికారికంగా ఎవరూ ఖరారు కాలేదు. అయితే ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుండటంతో, మరో మిడియం రేంజ్ స్టార్‌ని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరి న్యూ ఐకాన్ గా ఏ హీరో దిగుతాడో చూడాలి.