ఈ పాన్ ఇండియా హీరో రెండేళ్లు కనబడడు!
2 సంవత్సరాల పాటు ఎటువంటి విడుదలలు లేవు. అతడు ఈ రెండేళ్లు పూర్తిగా అట్లీతో భారీ చిత్రంపైనే ఫోకస్ పెడుతున్నాడు.
By: Tupaki Desk | 1 May 2025 3:57 AMదళపతి విజయ్ ఒక్కో సినిమాకు 250-275 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని కథనాలొచ్కచాయి. సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక్కో సినిమాకు 270 కోట్లు వసూలు చేస్తున్నారని, జైలర్ కోసం ఇంత పెద్ద మొత్తం అందుకున్నారని ప్రచారం ఉంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ డంకీకి రూ.150 కోట్ల మేర పారితోషికం తీసుకున్నాడు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కోసం రూ.100 కోట్లు తీసుకోగా, ప్రభాస్ కల్కి 2898 AD కోసం రూ.100-200 కోట్లు అందుకున్నాడని కథనాలొచ్చాయి.
అయితే వీళ్లందరి కంటే ఎక్కువ పారితోషికంతో నంబర్ వన్ స్థానాన్ని అలంకరించాడు అల్లు అర్జున్. అతడు నటించిన పుష్ప 2 చిత్రానికి 300 కోట్లు వసూలు చేసాడని కథనాలొచ్చాయి. ఇప్పుడు దర్శకుడు అట్లీతో కలిసి పని చేయనున్న చిత్రానికి సుమారు 175 కోట్లు (లాభాల్లో వాటాటు అదనం) అందుకుంటాడని కథనాలొస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా #AA22XA6 అని పేరు పెట్టారు. అయితే భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే అల్లు అర్జున్ రాబోవు రెండేళ్లు థియేటర్లలో కనిపించడు. 2 సంవత్సరాల పాటు ఎటువంటి విడుదలలు లేవు. అతడు ఈ రెండేళ్లు పూర్తిగా అట్లీతో భారీ చిత్రంపైనే ఫోకస్ పెడుతున్నాడు.
పుష్ప 2 కంటే ముందు అల్లు అర్జున్ నికర ఆస్తి 350 కోట్లు. ఆ తర్వాత అది డబుల్ అయిందని అంచనా. ఇప్పుడు అట్లీ సినిమాతో ట్రిపుల్ అవుతుంది. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో అల్లు అర్జున్ తన రేంజును స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదుగుతున్నాడని అంచనా.
అలాగే మహేష్ - రాజమౌళి సినిమా కోసం సుమారు 1000 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తుండగా, తదుపరి అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ మూవీ కోసం 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని కథనాలొస్తున్నాయి. హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తారని కూడా తెలుస్తోంది. ఈ సినిమాకి సన్ పిక్చర్స్ పెట్టుబడుల్ని సమకూర్చనుంది. అట్లీతో బన్ని సినిమా షూటింగ్ 2025 మధ్యలో ప్రారంభం కానుంది. అయితే సినిమా విడుదలకు సంబంధించి ఎటువంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇది 2026-2027లో రిలీజయ్యేందుకు ఛాన్సుందని అంచనా.