గోన గన్నారెడ్డి కోసం అతడిని సంప్రదించారా..?
రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం అల్లు అర్జున్ కంటే ముందు దర్శకుడు గుణశేఖర్ చాలా మంది హీరోలను పరిశీలించాడు.
By: Tupaki Desk | 31 Aug 2025 7:00 PM ISTఅనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ ఆ సినిమాలో నటించడం వల్ల క్రేజ్ అమాంతం పెరిగింది. అంతే కాకుండా అల్లు అర్జున్ కెరీర్‌లోనూ ఆ సినిమా చాలా స్పెషల్‌గా నిలిచింది. రుద్రమదేవి సినిమా ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం లో కీలక పాత్ర పోషించిన అల్లు అర్జున్ పాత్ర గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అవుతున్నా కూడా గోన గన్నారెడ్డి గురించి చర్చ జరిగిన సమయంలో అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పాత్ర గురించి ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గుణశేఖర్ రుద్రమదేవి సినిమాలో...
రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం అల్లు అర్జున్ కంటే ముందు దర్శకుడు గుణశేఖర్ చాలా మంది హీరోలను పరిశీలించాడు. అల్లు అర్జున్ ఆ పాత్రను చేస్తాడా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ గోన గన్నారెడ్డి పాత్ర నచ్చడంతో పాటు, గుణ శేఖర్ పై అభిమానంతో అల్లు అర్జున్ ఆ పాత్రను చేశాడట. ఒక వేళ ఆ పాత్రను అల్లు అర్జున్ చేయకుంటే తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఆ పాత్రను చేయాల్సి ఉందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. ఇటీవల ఆయన ఘాటీ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గోన గన్నారెడ్డి పాత్ర విషయంలో తనను సంప్రదించారు అని, ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల ఆఫర్ కోల్పోయాను అంటూ చెప్పుకొచ్చాడు.
క్రిష్ దర్శకత్వంలో ఘాటీ
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. పదేళ్ల ముందు అనుష్క, విక్రమ్ ప్రభు కలిసి నటించాల్సి ఉంది. కానీ ఇన్నాళ్లకు ఆ కాంబో సెట్ అయింది. ఈ మధ్య కాలంలో ఘాటీ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ విడుదల చేయబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను దర్శకుడు క్రిష్ ఈ సినిమాను రూపొందించాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ముఖ్యంగా అనుష్క, విక్రమ్ ప్రభు ప్రమోషన్ సమయంలో చెప్పుకొచ్చారు.
అనుష్క, విక్రమ్ ప్రభు ముఖ్య పాత్రల్లో...
లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వెళ్తున్న అనుష్క శెట్టి ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఘాటీ సినిమా కోసం అనుష్క చాలా కష్టపడిందని దర్శకుడు క్రిష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాను విడుదల చేయాలని భావించినా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో ఆలస్యం కావడం వల్ల ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు. ఆలస్యం అయినా కూడా ఖచ్చితంగా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ను ఇండస్ట్రీ వర్గాల వారు మీడియా సర్కిల్స్ వారు సైతం చెబుతున్నారు. ఈమధ్య కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు రాలేదు, ఆ లోటును ఈ సినిమా భర్తీ చేస్తుందా అనేది చూడాలి.
