బన్నీ పాత్రలు డైమండ్ క్రాసింగ్ లైన్ లా!
ఈ క్రాసింగ్ ని ఆధారంగా చేసుకునే అట్లీ నాలుగు పాత్రలను సింక్ చేస్తూ ఈ కథను సిద్దం చేసినట్లు కోలీవు డ్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ పాత్రల చుట్టూ టైమ్ క్యాలుక్లేషన్ ఒకటుందిట.
By: Tupaki Desk | 23 July 2025 8:15 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ నాలుగు పాత్రలు పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. అందులో రెండు పాత్రలు తండ్రీ-కొడుకులనే ప్రచారం జరుగుతోంది. మరో రెండు పాత్రలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అట్లీ తీసుకున్న ఈ నాలుగు పాత్రల సృష్టి వెనుక ఓ స్పూర్తి ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నాలుగు పాత్రలు సినిమాలో ఒకే చోట కలిసేలా నాగపూర్ డైమండ్ క్రాసింగ్ లైన్ లా ఉంటాయంటున్నారు.
సినిమాలో ఈ నాలుగు పాత్రల మధ్య వచ్చే క్లాష్ సినిమాలో రెండుసార్లు చోటు చేసుకుం టుందిట. ఇంటర్వెల్ బ్యాంగ్ లోనూ...తదుపరి క్లైమాక్స్ లోనూ ఈనాలుగు పాత్రలు ఒకదానికొకటి ఎలా రిలేటడ్ గా ఉంటాయి? అన్నది ఎంతో ఆసక్తికరంగా మలుస్తున్నారుట. మరి ఇంతకీ నాగపూర్ డైమండ్ క్రాసింగ్ లైన్ అంటే? ఓ ప్రత్యేకత ఉంది. భారతదేశం మొత్తంలో ఈ ఒక్క పాయిట్ దగ్గర మాత్రమే ఉత్తరం, పడమర. తూర్పు, దక్షిణం రైల్వే లైన్లు కలుస్తున్నాయి. దేశంలో ఇంకెక్కడా ఇలాంటి క్రాసింగ్ లేదు.
ఈ క్రాసింగ్ ని ఆధారంగా చేసుకునే అట్లీ నాలుగు పాత్రలను సింక్ చేస్తూ ఈ కథను సిద్దం చేసినట్లు కోలీవు డ్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ పాత్రల చుట్టూ టైమ్ క్యాలుక్లేషన్ ఒకటుందిట. ఆ పాయింట్ సినిమాలో టెక్నికల్ గా హైలైట్ గా ఉంటుందిట. ఇది పూర్తిగా భారత్ దేశంలో జరిగే స్టోరీ అంటున్నారు. మ రి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. బన్నీ ఇంత వరకూ ఏ సినిమాలో డ్యూయెల్ రోల కూడా పోషించలేదు. తొలిసారి ఏకంగా నాలుగు పాత్రలు పోషించడం విశేషం.
ప్రస్తుతం షూటింగ్ ముంబైలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ముంబై స్టూడియోల్లో వేసిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అక్కడే ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. అలాగే హైదరాబాద్, చెన్నైలో కూడా కొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. ఇందలో మెయిన్ లీడ్ కు దీపికా పదుకొణే ఫైనల్ అయింది. మరో ముగ్గురు నాయికల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
