Begin typing your search above and press return to search.

ఢిల్లీ హైకోర్టుకి నేడు అల్లు అర్జున్.. అసలు ఏం జరిగిందంటే?

ఇటీవల కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో కూసింత గుర్తింపు ఉంటే చాలు వారి అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, వాయిస్ ఉపయోగించుకుని కొంతమంది ఆదాయాన్ని పొందుతున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   17 April 2026 12:40 PM IST
ఢిల్లీ హైకోర్టుకి నేడు అల్లు అర్జున్.. అసలు ఏం జరిగిందంటే?
X

ఇటీవల కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో కూసింత గుర్తింపు ఉంటే చాలు వారి అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, వాయిస్ ఉపయోగించుకుని కొంతమంది ఆదాయాన్ని పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెండితెర సెలబ్రిటీల నుండి బుల్లితెర నటీనటుల వరకు ఎంతో మంది వ్యక్తిగత హక్కుల కోసం పోరాడుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో బడా స్టార్స్ గా పేరు సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లను మొదలుకొని.. టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వంటి సెలబ్రిటీల వరకు ఎంతోమంది వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించి.. ఊరట పొందిన విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు..

వ్యక్తిగత హక్కుల కోసం పోరాటం..

గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించారు. పుష్ప 2తో అంతర్జాతీయంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంత పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అనుమతి లేకుండా ఆయన పేరును , ఫోటోలను, వీడియోలను అలాగే వాయిస్ ని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలి అని హీరో అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాధారణంగా సెలబ్రిటీల పాపులారిటీని అడ్డం పెట్టుకొని కొన్ని సంస్థలు వారి అనుమతి లేకుండానే వాణిజ్య ప్రకటనలు లేదా ప్రచారాలు చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనివల్ల ఆ సెలబ్రిటీల వ్యక్తిగత బ్రాండ్ విలువ దెబ్బ తినడమే కాకుండా వారి ప్రమేయం లేని విషయాల్లో వారి పేరు వినిపించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఢిల్లీ హైకోర్టుకి అల్లు అర్జున్.. నేడే విచారణ..

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక అల్లు అర్జున్ వేసిన ఈ సివిల్ సూట్ ను జస్టిస్ తుషార్ రావు గెడెల నేతృత్వంలోనే ధర్మాసనం ఇవాళ విచారించనుంది. ఆయన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఏఐ సహాయంతో ఫోటోలు మార్ఫింగ్ చేసి, వాయిస్ మార్చి ప్రకటనలకు వాడుకోవడం వంటి చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం హైకోర్టు ధర్మాసనం ఈ విషయంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్ సినిమాలు..

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో పగలు మనిషిలా, రాత్రి మృగంలా అల్లు అర్జున్ కనిపించబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పైగా ఇందులో హీరో, విలన్ గా రెండు పాత్రలు అల్లు అర్జున్ పోషిస్తున్నారు అనే వార్తలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.