ఆర్య సినిమా మాత్రమే కాదు.. నెట్టింట బన్నీ పోస్ట్ వైరల్
అల్లు అర్జున్- సుకుమార్. వీరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ చాలా స్పెషల్. వీరిద్దరి కలయికలో ఇప్పటికే నాలుగు సినిమాలొచ్చాయి.
By: Tupaki Desk | 7 May 2025 11:51 AMఅల్లు అర్జున్- సుకుమార్. వీరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ చాలా స్పెషల్. వీరిద్దరి కలయికలో ఇప్పటికే నాలుగు సినిమాలొచ్చాయి. ఆర్యతో మొదలైన వీరి ప్రయాణం ఆ తర్వాత ఆర్య2, పుష్ప, పుష్ప2 సినిమాలు చేసేలా చేసింది. వీరిద్దరూ కలిసి గత 21 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నారు. 2004లో ఇదే రోజున వీరి కలయికలో తెరకెక్కిన ఆర్య సినిమా రిలీజైంది.
మే 7, 2004న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా బన్నీ- సుకుమార్ మధ్య అనుబంధాన్ని కూడా పెంచింది. బన్నీ కెరీర్లో స్పెషల్ సినిమాగా నిలిచిన ఈ సినిమా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ లో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఆర్య షూటింగ్ డేస్ ను గుర్తు చేశాడు.
తన పోస్ట్ లో "ఆర్య అనేది కేవలం సినిమా మాత్రమే కాదని, తన జీవితాన్ని మార్చిన జర్నీకి నాంది అని, మీ ప్రేమకు, మెమొరీస్ కు ఎంతో కృతజ్ఞుడిని" అని అల్లు అర్జున్ పోస్ట్ చేస్తూ ఆ పోస్ట్ కు #21YearsForArya అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు. బన్నీ షేర్ చేసిన ఈ ఫోటోల్లో అతనితో పాటూ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్ అను మెహతా, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్, ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఉన్నారు.
అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా ఈ పోస్ట్ కు అతని ఫ్యాన్స్ లైక్ చేస్తూ ఇలాంటి లవ్ స్టోరీ మళ్లీ చేయమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో కూడా అల్లు అర్జున్ ఆర్య సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆర్య సినిమా తనను స్టార్ గా మార్చిందని, సుకుమార్ ను పెద్ద డైరెక్టర్ ను చేసిందని చెప్పాడు. ఇప్పుడు మరోసారి ఆర్యపై బన్నీ తన ప్రేమను బయటపెట్టాడు బన్నీ.