ఉన్న పొగ చాలు.. కొత్తవెందుకు? బన్నీ వాసు ట్వీట్ వైరల్
రీసెంట్ గా బన్నీ గాడ్ మీమ్స్ బ్రహ్మానందం ఫోటో ఉన్న టీ షర్టు వేసుకుని బయట కనిపించాడు. దాని మీద బ్రహ్మీ ఫోటోతో పాటూ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని కూడా ఉంది.
By: Tupaki Desk | 3 May 2025 9:30 PMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య బన్నీ వేసుకునే బట్టలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. రకరకాల కొటేషన్స్ ఉన్న టీషర్టులతో బన్నీ బయట కనిపిస్తున్నాడు. రీసెంట్ గా బన్నీ గాడ్ మీమ్స్ బ్రహ్మానందం ఫోటో ఉన్న టీ షర్టు వేసుకుని బయట కనిపించాడు. దాని మీద బ్రహ్మీ ఫోటోతో పాటూ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని కూడా ఉంది.
ఈ విషయంలో ఓ మీడియా వ్యక్తి సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో అటెన్షన్ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. మీరేమంటారు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దానికి బన్నీకి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు, నిర్మాత బన్నీ వాసు రెస్పాండ్ అవుతూ ఓ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రపంచం మొత్తం గర్వించదగ్గ బ్రహ్మానందం లాంటి ఓ కమెడియన్ పై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా? దాన్ని కూడా ఇలా కామెంట్ చేయాలా సార్? ఆయన వేసుకున్న టీ షర్ట్ పై ఇలాంటి లాజిక్స్ అప్లై చేస్తారా? అక్కడ తన ఫేవరెట్ కమెడియన్ పై బన్నీ గారి ప్రేమ మీకు కనిపించలేదా అని అడిగాడు.
మీ దృష్టిలో బ్రహ్మానందం గారిని బన్నీ గారు హైలైట్ చేశారనే పాజిటివ్ యాంగిల్ కనిపించలేదు కానీ ఇలాంటి కోణం మాత్రం ఒకటుంటుందని వెతికారని బన్నీ వాసు ట్వీట్ చేశాడు. వీలైతే గొడవలు ఆపుదాం, మంచి విషయాలను పాజిటివ్ గా చెబుదాం. నన్ను ఇన్‌స్పైర్ చేసిన మనిషి చిరంజీవి గారు అని బన్నీ నిన్ననే నేషనల్ స్టేజ్ పై ఎంతో బాగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్ లోకి రాలేదనుకుంటా, అలాంటివి మీరు పట్టించుకోరు అని సదరు జర్నలిస్ట్ పై బన్నీ వాసు ఫైర్ అయ్యాడు.
అలాంటి వాటిని హైలైట్ చేస్తే మనసులో మాట కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుందని, కాస్త మంచి జరుగుతుందని, ఇప్పటికే ఉన్న పొగ చాలు, ఇంకా కొత్తవి ఎందుకు సార్ అంటూ ఆ జర్నలిస్ట్ ను అడిగాడు బన్నీ వాసు. అయితే బన్నీ ఈ టీ షర్టు వేసుకున్న దాని వెనుక ఉద్దేశం వేరని, జనసైనికులంతా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని అంటున్న టైమ్ లో బన్నీ ఇలా కావాలని నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా అనే టీ షర్ట్ వేసుకుని కామెడీ చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ బన్నీని ట్రోల్ చేస్తున్నారు.