Begin typing your search above and press return to search.

అల్లు - అట్లీ.. విలన్ రోల్ కోసం హాలీవుడ్ స్టార్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్టు కొట్టిన తరువాత నెక్స్ట్ టార్గెట్స్ అంతకుమించి అనేలేనా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   9 July 2025 1:13 PM IST
అల్లు - అట్లీ.. విలన్ రోల్ కోసం హాలీవుడ్ స్టార్?
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్టు కొట్టిన తరువాత నెక్స్ట్ టార్గెట్స్ అంతకుమించి అనేలేనా ఉన్నాయి. అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్లు - అట్లీ కాంబో నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇద్దరు కూడా అంతకుమించి అనేలా ఆలోచిస్తున్నారట. ఏకంగా హాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబో ఖరారైనప్పటి నుంచే సినిమా రేంజ్ భారీగా పెరిగింది. ఫుల్ మాస్, స్టైలిష్ ట్రీట్ కావొచ్చని ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి.

ఇప్పుడు ఆ కాంబో మీద ఇంకొక భారీ వార్త వైరల్ అవుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమాకు విలన్‌గా హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను సంప్రదించారట. ‘ఐ యామ్ లెజెండ్’, ‘మెన్ ఇన్ బ్లాక్’, ‘కింగ్ రిచర్డ్’ వంటి వరల్డ్ ఫేమస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విల్ స్మిత్.. ఈ భారీ బడ్జెట్ తెలుగు సినిమాలో అల్లు అర్జున్‌కు శత్రువుగా కనిపించనున్నారట.

ఈ ప్రాజెక్ట్‌కు స్కై ఫై నేపథ్యం ఉండనుందని టాక్. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ఇండియన్ సినిమా స్టాండర్డ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉండనుందని అంటున్నారు. విల్ స్మిత్ కన్ఫామ్ కాకపోతే.. డ్వేన్ జాన్సన్ (ది రాక్) అనే మరో స్టార్ పేరును కూడా అట్లీ బృందం పరిగణనలోకి తీసుకుందట. మరి ఇద్దరిలో ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి.

ఇక హీరోయిన్ విషయంలో అయితే ఈ సినిమా మరింత హై లెవెల్ గా మారనుంది. ఇప్పటికే దీపికా పదుకోన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంటే స్క్రీన్ మీద గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు ఉంటాయన్నమాట.

ఈ మాస్ కాంబినేషన్‌కు సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. టెక్నికల్ టీమ్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ బ్లాక్ లెవెల్ అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చని ఫిలిం నగర్ టాక్. ఇక విల్ స్మిత్ తెలుగు తెరపై కనిపిస్తే అది ఇండియన్ సినిమాకు కూడా ఒక బిగ్ అచివ్ మేంట్ గా నిలవనుంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.