బన్నీ-అట్లీ కోసం బరిలోకి విజయేంద్ర ప్రసాద్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 July 2025 11:00 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈసారి అట్లీ శైలికి భిన్నంగా తెరకెక్కిస్తున్నాడు. టెక్నికల్ గా సినిమాను హైలైట్ చేస్తున్నాడు. అలాగని ఇదేదో సాహసం కాదు. అట్లీ తన మార్క్ కమర్శియల్ అంశాలో తప్పక జోడీస్తాడు. కథ విషయంలో చిన్న లాజిక్ తో పెద్ద సక్సెస్ కొట్టడం అన్నది అతడికే తెలిసిన టెక్నిక్ మాత్రమే. అతడి కథలకు హీరోల ఇమేజ్ కూడా తోడవ్వడంతో మార్కెట్ లో భారీ విజయం సాధిస్తున్నాయి.
బన్నీ ప్రాజెక్ట్ కూడా అలాంటిందే. ఇందులో బన్నీ మూడు పాత్రలు పోషిస్తున్నాడు. ఆ మూడు పాత్రలకు తగ్గట్టు ముగ్గరు హీరోయిన్లను ఎంపిక చేసారు. ప్రస్తుతం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈ సినిమాకు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసా ద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారట. అట్లీ కోరిక మేరకు పెద్దాయన రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అట్లీ దర్శకత్వం వహించిన 'మెర్సల్'సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే అందించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అలా అట్లీ-విజయేంద్ర ప్రసాద్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. బన్నీ ప్రాజెక్ట్ కు కూడా స్క్రీన్ ప్లే అందించాలని అట్లీ కోరడంతో ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. విజయేంద్ర ప్రసాద్ తన ప్రతిభను కేవలం ఒకే భాషకు పరిమితం చేయరు. అన్ని భాషల హీరోలకు తన కథల్ని అందిస్తుంటారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఆయన ప్రస్తానం కనిపిస్తుంది.
తమ సినిమాలకు స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాలని రిక్వెస్ట్ చేసినా విజయేంద్ర ప్రసాద్ తన సహకారాన్ని అందిస్తుంటారు. ఆ రకంగా అట్లీ కోసం 'మెర్సల్' తర్వాత మళ్లీ పనిచేస్తున్నారు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రానికి కథ అందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.
