బన్నీ ట్రిపుల్ రోల్ ఇదో రికార్డు!
విశ్వ నటుడు కమల్ హాసన్ మాత్రమే దశావతారం ఎత్తారు. ఆ సినిమా లో ఏకంగా పది పాత్రలు పోషించిన ఏకైక ఇండియన్ లెజెండరీగా చరిత్ర సృష్టించారు.
By: Tupaki Desk | 9 Jun 2025 9:30 AMవిశ్వ నటుడు కమల్ హాసన్ మాత్రమే దశావతారం ఎత్తారు. ఆ సినిమా లో ఏకంగా పది పాత్రలు పోషించిన ఏకైక ఇండియన్ లెజెండరీగా చరిత్ర సృష్టించారు. అలాంటి నటుడుకి ద్విపాత్రా భినయం... త్రిపాత్రాభి నయాలు అన్నది చాలా చిన్న విషయం. అటుపై చియాన్ విక్రమ్ రకరకాల పాత్రలు పోషించారు. వివిధ గెటప్స్ లో ప్రేక్షకులను అలరించారు. నటులుగా దేశంలోనే ఇద్దరు ఎంతో ప్రత్యేకమైన వాళ్లు.
కమల్ హాసన్ తర్వాత స్థానం ఎవరిది అంటే విక్రమ్ మాత్రమే అర్హుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి ప్రతిభ పాత్రలు మాత్రమే ఆ స్థానాన్ని కట్టబెట్టాయి. టాలీవుడ్ లోనూ చాలా మంది నటులు డ్యూయెల్ రోల్ పోషించారు. అయితే నేటి జనరేషన్ హీరోలు త్రిపాత్రా భినయం ఎవరూ చేయలేదు. రామ్ చరణ్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా చాలా మంది స్టార్లు ఉన్నారు. కానీ ఎవరూ ఇంతవరకూ మూడు పాత్రలు పోషించలేదు.
అయితే ఇప్పుడా సాహసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్నాడు. బన్నీ 22వ చిత్రం అట్లీ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ రేంజ్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణం కోసం సన్ పిక్చర్స్ వందల కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులకే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తుంది. అయితే ఈసినిమా స్టోరీ బన్నీ ని త్రిపాత్రాభినయానికి డిమాండ్ చేస్తుందిట.
ఇప్పటి వరకూ ద్విపాత్రాభినయం అంటూ ప్రచారం సాగింది. కానీ రెండ కాదు మూడు పాత్రలు పోషి స్తున్నాడు? అన్నది కొత్త అంశం. ఇదే నిజమైతే ఇది రికార్డు అవుతుంది. ఇంతవరకూ ఏ హీరో మూడు పాత్రలు పోషించే సాహసం చేయలేదు. ఏ డైరెక్టర్ కూడా ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఒకటి లేదా రెండు పాత్రతోనే హీరో పాత్రలను చుట్టేసేవారు. కానీ అట్లీ మాత్రం బన్నీతో మూడు పాత్రలు వేయించి మరో విశ్వనటుడిని తయారు చేస్తున్నాడు. దీనికి సంబంధించి న్యూయార్క్ ఫిల్మ్స్ స్టూడియోస్ లో టెస్ట్ షూట్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం.