AA22xA6లో బన్నీ క్యారెక్టర్ ఇదేనా?
దీంతో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని భారీ స్థాయిలో చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే తమిళ దర్శకుడు అట్లీతో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 14 May 2025 4:30 PM`పుష్ప 2`తో అల్లు అర్జున్ చుట్టూ ఏ స్థాయి వివాదాలు చుట్టుకున్నాయో అంతకు మించిన క్రేజ్‌ని, తదుపరి సినిమాలపై భారీ క్లారిటీని అందించింది. అన్ని క్రాఫ్ట్‌లలోనూ భారీతనాన్ని చూపిస్తూ బన్నీ క్యారెక్టర్నిసుకుమార్ మరింతగా ఎలివేట్ చేసిన తీరు పెద్దలతో పాటు పిల్లని సైతం మెస్మరైజ్ చేసింది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈమూవీ బ్లాక్ బస్టర్ టాక్‌లో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి బన్నీ స్టామినా ఏంటో ఇండియన్ సినీ వర్గాలకు గుర్తు చేసింది.
దీంతో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని భారీ స్థాయిలో చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే తమిళ దర్శకుడు అట్లీతో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. భారీ సినిమాల నిర్మాత, కేవలం తమిళ స్టార్స్‌తో మాత్రమే భారీ సినిమాలని నిర్మించే ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే పలు హాలీవుడ్ స్టార్స్‌ని, టెక్నీషియన్స్‌ని సంప్రదించిన టీమ్ హాలీవుడ్ స్టైలిస్ట్‌లని కూడా రంగంలోకి దించేసప్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ని కనీవినీ ఎరుగని రీతిలో ఊహకందని కథా, కథనాలతో భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని, ఇందులో బన్నీ క్యారెక్టర్‌ని సరికొత్తగా తీర్చిదిద్ది ఇండియన్ ప్రేక్షకులకు హాలీవుడ్ మూవీ చూసిన ఫీల్‌ని కలిగించాలనే ప్లాన్‌తో దర్శకుడు అట్లీ భారీగా స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు హాలీవుడ్ వీఎఫ్ ఎక్స్ కంపనీలతో చర్చలు జరుపుతున్న అట్లీ ఈ మూవీతో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేయబోతున్నారట. హాలీవుడ్ టెక్నీషియన్‌లతో పాటు హాలీవుడ్ స్టార్స్, ఇండియన్ స్టార్స్ కలయికలో తెరకెక్కించనున్నారట.
ఇదిలా ఉంటే ఈ మూవీలో బన్నీ క్యారెక్టర్, ఆయన మేకోవర్ ఎలా ఉండబోతోంది? ప్రజాఎక్ట్‌ని ప్రకటించిన సందర్భంగా పలు హాలీవుడ్ స్టూడియోలకు వెళ్లిన బన్నీ, అట్లీ అక్కడున్న కామిక్ క్యారెక్టర్ల పక్కన నలబడి పోజులివ్వడంతో బన్నీ క్యారెక్టర్ హాలీవుడ్ సూపర్ హీరోల తరహాలో ఉండనుందనే క్లారిటీ అందరికీ వచ్చేసింది. ఆ విషయాన్ని నిజం చేస్తూ బన్నీ క్యారెక్టర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటికొచ్చింది. సినిమా అంతే ఓ ప్రత్యేక లోకంలో సాగుతుందట.
బన్నీ ఇందులో ఓ భయంకరమైన పోరాట యోధుడిగా పక్కాగా చెప్పాలంటే ఓ పవర్‌ఫుల్ సూపర్ హీరోగా కనిపిస్తాడని, అతని గెటప్, మేకోవర్ హాలీవుడ్ సినిమాల్లోని హీరోలకు ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది. అంతే కాకుండా కథ దాదాపుగా వివిధ కాలాల్లో సాగుతుందని, బన్నీ విభిన్నమైన క్యారెక్టర్లలో కనిపిస్తాడని, అంతే కాకుండా సినిమాని నడిపించే విధానం ఓ బెంచ్ మార్క్‌ని సెట్ చేస్తుందని ఇన్ సైడ్ టాక్.