Begin typing your search above and press return to search.

శ్రీవల్లిని వదలని పుష్ప రాజ్..!

అల్లు అర్జున్, రష్మిక జోడీ సూపర్ హిట్ అనిపించుకుంది. ఐతే వీరిద్దరు పుష్ప 3 కూడా చేయాల్సి ఉన్నా ఈలోగా అట్లీ సినిమాలో రష్మికని తీసుకుంటున్నారట.

By:  Tupaki Desk   |   10 July 2025 8:30 AM IST
శ్రీవల్లిని వదలని పుష్ప రాజ్..!
X

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన పుష్ప రాజ్ అదేనండి అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా తో మళ్లీ రికార్డులను టార్గెట్ గా పెట్టుకున్నాడు. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ 500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమా హీరోయిన్స్ విషయంలో కన్ ఫ్యూజన్ ఏర్పడింది. ఇప్పటికే అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో ఒక హీరోయిన్ గా దీపిక పదుకొనెని లాక్ చేశారు చిత్ర యూనిట్.

దీపిక సినిమాలో చాలా పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆమెతో పాటు ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. జాన్వి కపూర్ ని కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ కి తీసుకున్నారని టాక్. ఐతే సినిమాలో మరో హీరోయిన్ కూడా అవసరం ఉండగా ఆ ఛాన్స్ ని రష్మిక మందన్నకి ఇచ్చారని చెబుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప 1, 2 సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటించింది.

అల్లు అర్జున్, రష్మిక జోడీ సూపర్ హిట్ అనిపించుకుంది. ఐతే వీరిద్దరు పుష్ప 3 కూడా చేయాల్సి ఉన్నా ఈలోగా అట్లీ సినిమాలో రష్మికని తీసుకుంటున్నారట. రష్మిక సెలక్షన్ అల్లు అర్జున్ వల్లే అని అంటున్నారు. ఈమధ్య రష్మిక చేస్తున్న సినిమాలు మాక్సిమం సూపర్ హిట్ అవుతున్నాయి. ఆమె హిట్ సెంటిమెంట్ కూడా ప్రాజెక్ట్ లకు కలిసి వస్తున్నాయి.

అందుకే అల్లు అర్జున్ అట్లీ తమ సినిమాలో కూడా రష్మికని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో రష్మిక ఎంట్రీ ఇచ్చింది అంటే ఇక ఆ సినిమా రేంజ్ మరింత పెరిగినట్టే. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బడా సినిమాలు సైన్ చేస్తున్న రష్మికకు అల్లు అర్జున్ ఆఫర్ మళ్లీ ఆమె సత్తా చాటేలా ఉంటుందని చెప్పొచ్చు.

అల్లు అర్జున్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ సినిమాలో కూడా రష్మిక ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో సూపర్ హీరోగా కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమా అనౌన్స్ మెంట్ వీడియోతోనే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు అట్లీ. తప్పకుండా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మరోసారి తన మాస్ స్టామినా ప్రూవ్ చేసేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు.