అల్లు అర్జున్ - అట్లీకి నో రెమ్యునరేషన్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 10 April 2025 9:00 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ప్రముఖ వీఎఫ్ ఎక్స్ కంపెనీలని ప్రత్యేకంగా అట్లీ, అల్లు అర్జున్ కలవడం, అక్కడ సూపర్ హీరో క్యారెక్టర్ల ముందు ఫోజులివ్వడంతో ఇదొక సైన్స్ ఫిక్షన్ అని, ఇందులో బన్నీ సూపర్ హీరో తరహా క్యారెక్టర్‌లో కనిపించనున్నాడని క్లారిటీ వచ్చేసింది.
దీంతో ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల ఊహాగానాలు, సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య చర్చలు తారా స్థాయికి చేరుకున్నాయి. `జవాన్`తో వరల్డ్ వైడ్‌గా సంచలనం సృష్టించిన అట్లీ - `పుష్ప 2` పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకుని మెయిన్ లీగ్‌లోకి ఎంటరైన బన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్‌తో ఇండియన్ సినీ హిస్టరీలోనే ఓ భారీ పాన్ వరల్డ్ సినిమాలు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయిలో సూపర్ హీరో మార్కు గ్రాఫిక్స్‌తో ఈ మూవీని దర్శకుడు అట్లీ తెరపైకి తీసుకురాబోతున్నాడు.
సన్ పిక్చర్స్ అధినేత కళానిథిమారన్ ఈ క్రేజీ మూవీ కోసం దాదాపుగా రూ. 600 నుంచి రూ.700 కోట్ల మేర బడ్జెట్‌ని ఖర్చు చేయబోతున్నారట. హాలీవుడ్ సినిమాల స్థాయిలో వీఎఫ్ ఎక్స్ కోసం అత్యధకంగా ఖర్చు చేయనున్నారట. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌కు హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. దానికి బదులుగా బన్నీకి సినిమా లాభాల్లో 35 శాతం వాట ఇవ్వనుండగా, అట్లీకి 15 శాతం వాటా ఇవ్వనున్నారట.
చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఇది బిగ్‌రిస్క్ అనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీకి, అట్లీకి ఎంత క్రేజ్ ఉన్నా రూ.700 కోట్లతో గేమ్ అంటే మామూలు విషయం కాదని, మేకర్స్‌తో పాటు బన్నీకి, అట్లీకి పెద్ద రిస్కేనని అంటున్నారు. అనుకున్న విధంగా ఔట్‌పుట్ వస్తే ఫరవాలేదు. రాకపోతే బిగ్ డిజాస్టర్‌ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు, అభిమానులు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ ప్రాజెక్ట్ ఎలా రానుంది, అట్లీ మనసులో ఏముందన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
