Begin typing your search above and press return to search.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ ఫుల్ స్వింగ్‌లో బ‌న్నీ- అట్లీ ప్రాజెక్ట్

ఈ మూవీ త‌రువాత అల్లు అర్జున్ క్రేజీ త‌మిళ్ డైరెక్ట‌ర్ అట్లీతో భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీకి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించ‌డంతో ఇది ప్ర‌స్తుతం ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.

By:  Tupaki Desk   |   21 May 2025 4:17 PM IST
Allu Arjun and Atlee Join Forces for Mega Pan-World Film
X

'పుష్ప 2'తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఐకాన్ స్టార్ ఈ మూవీతో త‌న కెరీర్‌లోనే నెవ‌ర్ బిఫోర్ ఫీట్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన 'పుష్ప‌2' వివాదాల కార‌ణంగా, కంటెట్ వైజ్‌గా కూడా టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలిచి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత అల్లు అర్జున్ క్రేజీ త‌మిళ్ డైరెక్ట‌ర్ అట్లీతో భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీకి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించ‌డంతో ఇది ప్ర‌స్తుతం ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.

అట్లీ డైరెక్ట్ చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. అంతే కాకుండా భారీ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ తెలుగులో నిర్మిస్తున్న తొలి మూవీ ఇదే కావ‌డం విశేషం. పాన్ వ‌ర‌ల్డ్‌కు మించి ఈ మూవీని హాలీవుడ్ సూప‌ర్ హీరో సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో నెవ‌ర్ బిఫోర్ అనే విథంగా అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇప్ప‌టికే ప‌లు హాలీవుడ్ వీఎఫ్ ఎక్స్ స్టూడియోల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన టీమ్ ఈ మూవీ కోసం భారీగానే ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్ర‌త్యేకంగా హీరో అల్లు అర్జున్,హాలీవుడ్ టెక్నిషియ‌న్స్, ద‌ర్శ‌కుడు అట్లీల‌పై విడుద‌ల చేసిన వీడియో ఇప్ప‌టికే వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. హాలీవుడ్ సూప‌ర్ హీరో సినిమాల త‌ర‌హాలో బ‌న్నీ క్యారెక్ట‌ర్ స‌రికొత్త పంథాలో సాగ‌నుంద‌ని ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు అట్లీ హింట్ ఇవ్వ‌డం తెలిసిందే. వేరు వేరు ప్ర‌పంచాల నేప‌థ్యంలో స‌రికొత్త‌గా సాగ‌నున్న ఈ మూవీలో బ‌న్నీ మూడు విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీ ఎప్పుడు మొద‌ల‌వుతుంది? ఎలా ఉండ‌బోతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వర్క్ స్పీడందుకుంది. ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు అట్లీ బుధ‌వారం హైద‌రాబాద్‌లో ల్యాండ్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బ‌న్నీని క‌లిసి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కు సంబంధించిన చ‌ర్చ‌ల్లో పాల్గొన‌బోతున్నారు. ఎందుకంటే జూన్ నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

`A22xA6` అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని హాలీవుడ్ సంకేతిక‌త‌ను ఉప‌యోగిస్తూనే భార‌తీయ విలువ‌తో భారీ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌. అంత‌ర్జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా ఈ మూవీని నిల‌ప‌బోతున్నార‌ట‌. వీఎఫ్ ఎక్స్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉండ‌నున్న ఈ మూవీకి సంబంధించిన కీల‌క న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది.