Begin typing your search above and press return to search.

#AAxA6 రిలీజ్ టైమ్ ఫిక్సైపోయింది!

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 2` ట్రెమండ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల‌ని అంతకు మించి అనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   15 May 2025 5:49 AM
Allu Arjun Teams Up with Atlee for a Pan-World Superhero Spectacle Movie
X

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 2` ట్రెమండ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల‌ని అంతకు మించి అనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ త‌రువాత అల్లు అర్జున్ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో భారీ పాన్ వ‌ర‌ల్డ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డం తెలిసిందే. భారీ చిత్రాల నిర్మాత స‌న్ పిక్చ‌ర్స్ అధినేత క‌ళానిధి మార‌న్ ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే నెవ‌ర్ బిఫోర్ అనే టెక్నాల‌జీతో నిర్మించ‌బోతున్నారు. ఇటీవ‌ల ఈప్రాజెక్ట్ కు సంంధించిన వీడియోల‌ని టీమ్ విడుద‌ల చేయ‌డంతో ఇది ఇండియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ప్రాజెక్ట్ కోసం ప‌లు హాలీవుడ్ కంప‌నీలు ప‌ని చేయ‌బోతున్నాయి. ప‌లు హాలీవుడ్ సినిమాల‌కు వీఎఫ్ ఎక్స్‌ని అందించిన పాపుల‌ర్ స్టూడియోలు ఈ మూవీకి వీఎఫ్ ఎక్స్ అందించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే టీమ్ ఓ వీడియోని విడుద‌ల చేసి క్లారిటీ ఇచ్చేసింది. హాలీవుడ్ సూప‌ర్ హీరోల క్యారెక్ట‌ర్‌ల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో బ‌న్నీ క్యారెక్ట‌ర్‌ని ద‌ర్శ‌కుడు అట్లీ డిజైన్ చేస్తున్నార‌ట‌. స‌రికొత్త ప్ర‌పంచం నేపథ్యంలోని వివిధ కాలాల్లో ఈ సినిమా సాగుతుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

అందుకే స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కు అల్లు అర్జున్ క్యారెక్ట‌ర్‌ని స‌రికొత్త‌గా సూప‌ర్ హీరోగా అట్లీ మ‌లుస్తున్నాడ‌ట‌. ప‌లువురు హాలీవుడ్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వ‌ర్క్ చేయ‌బోతున్న‌కి అప్పుడే టీమ్ రిలీజ్ టైమ్‌ని కూడా ప‌క్కాగా ఫిక్స్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. 2027 సంక్రాంతికి పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో టీమ్ ఉన్న‌ట్టుగా తెలిసింది.

అంతే కాకుండా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు రాకెట్ స్పీడుతో జ‌రుపుకుంటున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఈ ఏడాది డిసెంబ‌ర్ నుంచి ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఏడాది పాటు ఈ మూవీ కోసం లాంగ్ షెడ్యూల్‌ని ప్లాన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది కార‌ణం వీఎఫ్ ఎక్స్‌కు ఎక్కువ టైమ్ ప‌డుతుంది కాబ‌ట్టి షూటింగ్‌తో పాటు వీఎఫ్ ఎక్స్‌ని కూడా ప్యార‌ల‌ల్‌గా పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అలా చేస్తేనే అనుకున్న స‌మ‌యానికి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశం ఉంటుంది. అందుకే అట్లీ ఇలా రెండు ఒకే స‌మ‌యంలో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.